నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే బీజేపీ మహిళా నేత స్వాధ్వీ ప్రజ్ఞా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గోమూత్రం కారణంగానే తనకు బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిందంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ నగరంలో బీజేపీ అభ్యర్థిగా ప్రజ్ఞాద తాజాగా నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విధమైన కామెంట్స్ చేశారు. గోవుల చుట్టూ తిరుగుతున్న ప్రస్థుత రాజకీయాల గురించి ఆమె ను విలేకరులు ప్రశ్నించగా.. విచిత్ర సమాధానాలు ఇచ్చారు.

గో మూత్రం వల్ల చాలా ప్రాంతాల్లో వ్యాధులు నయం అవుతున్నాయని చెప్పారు. గోవులను దానం చేయడం అమృతమని ఆమె వ్యాఖ్యానించారు. ఆవు మూత్రంతోపాటు ఆవుల ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. ఆవు మూత్రం తాగితే తన కేన్సర్ కూడా నయం అయిందని చెప్పారు.
 
గోమూత్రంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని సాథ్వీ ప్రజ్ఞా చెప్పారు. ‘‘నేను బ్రెస్ట్ కేన్సర్ రోగిగా ఉన్నపుడు గోమూత్రంతో పాటు పంచగవ్వ కలిపిన ఆయుర్వేద ఉత్పత్తులు తీసుకున్నానని సాథ్వీ పేర్కొన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఐదు గోవుల మూత్రంతోపాటు ఆవు పేడ, పాలు, పెరుగు, నెయ్యి కలిపి పంచగవ్వ తయారు చేసి వాడానన్నారు. గోమాత శరీరాన్ని రుద్దడం వల్ల బ్లడ్ ప్రషర్ అదుపులో ఉంటుందని చెప్పారు.‘‘గోమాత వెనుక, మెడ నిమిరితే రక్తపోటు అదుపులో ఉంటుంది’’ అని సాథ్వీ ప్రజ్ఞా చెప్పారు.తపస్సు చేసుకోవడానికి గోశాల అనువైన ప్రదేశమని సాథ్వీ ప్రజ్ఞా వివరించారు.