Asianet News TeluguAsianet News Telugu

ఈయూ వెళ్లానుకున్న వారికి షాక్.. కోవిషీల్డ్ వేసుకుంటే ‘గ్రీన్ పాస్’ కు నో..!!

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రా జెనికా వ్యాక్సిన్ ను సీరం ఇనిస్టిట్యూట్ కోవీషీల్డ్ పేరుతో భారత్ లో ఉత్పత్తి చేస్తుంది. ఈ విషయం తెలిసిందే.. అయితే.. యూరోపియన్ యూనియన్ లో సీరం ఇనిస్టిట్యూట్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. 

Covishield excluded from new EU Covid 'Green Pass' eligibility list even after WHO approval - bsb
Author
Hyderabad, First Published Jun 28, 2021, 1:57 PM IST

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రా జెనికా వ్యాక్సిన్ ను సీరం ఇనిస్టిట్యూట్ కోవీషీల్డ్ పేరుతో భారత్ లో ఉత్పత్తి చేస్తుంది. ఈ విషయం తెలిసిందే.. అయితే.. యూరోపియన్ యూనియన్ లో సీరం ఇనిస్టిట్యూట్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. 

యూరోపియన్ యూనియన్ జూలై 1 నుంచి జారీ చేయనున్న గ్రీన్ పాస్ లను పొందేందుకు అర్హత గల వ్యాక్సిన్ ల జాబిత నుంచి సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవీ షీల్డ్ ను ఈయూ తొలగించింది.

ఈ నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా స్పందించారు. ఈయూ తాజా నిర్ణయంతో కోవీషిల్డ్ టీకా తీసుకుని, ఈయూ జారీ చేసే గ్రీన్ పాస్ లు పొందేందుకు అర్హత కోల్పోయిన భారతీయులను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘ఈయూ దేశాల ప్రతినిధులతో ఈ విషయం మీద చర్చించి, అతి త్వరలో ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాను’ అని అయన ట్విటర్ లో పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios