ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ అక్కడక్కడా కనిపిస్తుండడంతో అందర్లోనూ వేసుకుంటే ఏమవుతోందో.. వేసుకోకపోతే ఎలా? లాంటి సందిగ్థం ఉంది. అయితే దేశీయంగా వేస్తున్న కోవీషీల్డ్, కోవాగ్జిన్ రెండు కరోనా వైరస్ టీకాలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. 

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ అక్కడక్కడా కనిపిస్తుండడంతో అందర్లోనూ వేసుకుంటే ఏమవుతోందో.. వేసుకోకపోతే ఎలా? లాంటి సందిగ్థం ఉంది. అయితే దేశీయంగా వేస్తున్న కోవీషీల్డ్, కోవాగ్జిన్ రెండు కరోనా వైరస్ టీకాలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. 

కరోనావైరస్ ఇండియన్ వేరియంట్ మీద ఈ రెండు వ్యాక్సిన్లు చాలాబాగా పోరాడుతున్నాయని, టీకా వేసుకున్న తరువాత కాస్త నలతగా ఉండడం మామూలే అని ఈ అధ్యయనంలో పాల్గొన్న సీనియర్ సైంటిస్ట్ ఒకరు మంగళవారం తెలిపారు. 

ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజిఐబి) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ మాట్లాడుతూ, SARS-CoV2 వేరియంట్ అయిన B.1.617 మీద ఈ రెండు వ్యాక్సిన్లు అత్యధిక ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. టీకా తరువాత చాలా స్పల్పంగా ఇన్ఫెక్షన్ కనిపిస్తుందని అన్నారు. 

B.1.617 వేరియంట్‌ను '' డబుల్ మ్యూటాంట్ '' లేదా '' ఇండియన్ స్ట్రెయిన్ '' అని కూడా పిలుస్తారు."పోస్ట్-కోవాక్సిన్ లేదా కోవిషీల్డ్ సెరా రెండింటితోనూ B.1.617 వేరియంట్ కు కాస్త ఇన్ఫెక్షన్ చూపిస్తాయని మొదట్లోనే తటస్ఠమైన అధ్యయనాలు వచ్చాయని.. అయితే ఇప్పుడు వచ్చిన అధ్యయన ఫలితం చాలా పాజిటివ్ గా ఉందని... వైరస్ సోకకుండా కాపాడడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని తేలడం సంతోషకరమైన విషయం’ అని అగర్వాల్ ట్వీట్ చేశారు.

కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) కింద పనిచేసే ఒక సంస్థ ఐజిఐబి. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎమ్‌బి) చేసిన మరో అధ్యయనం ప్రకారం, ఇన్-విట్రో న్యూట్రలైజేషన్ అస్సేను ప్రకారం సెరా, కోవిషీల్డ్-వ్యాక్సిన్డ్ సెరా రెండూ B.1.617 వేరియంట్ మీద సమర్థంగా పనిచేస్తాయి. 

కోవిషీల్డ్ B1617 నుండి రక్షణ కల్పిస్తుందని ఒక ప్రాధమిక అధ్యయన ఫలితం. విట్రో న్యూట్రలైజేషన్ అస్సే ఉపయోగించి చేసిన మొదటి దశ ఫలితాల్లో బి .1.617 వేరియంట్, అకా # డబుల్ మ్యూటాంట్ అంటూ రాకేశ్ మిశ్రా గత వారం ట్వీట్ చేశారు.

B.1.617 వేరియంట్లో మూడు కొత్త స్పైక్ ప్రోటీన్ ఉత్పరివర్తనలు ఉన్నాయి. E484Q, L452R అనే రెండు ఉత్పరివర్తనల యాంటీబాడీ-ఆధారిత తటస్థీకరణకు పనిచేస్తాయి.

మూడవ మ్యుటేషన్ - P681R - వైరస్ కణాలలోకి ప్రవేశించడానికి మెరుగ్గా అనుమతిస్తుంది. ఇవి వేరియంట్ లక్షణాలను నిర్వచిస్తాయి. SARS-CoV2 యొక్క B.1.617 వేరియంట్ మహారాష్ట్ర,ఢిల్లీలో ఎక్కువగా ఉంది. దీనివల్లే సెకండ్ వేవ్ భయంకరంగా ఉంది.