Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: కేరళలో ఆ రెండు రోజులు లాక్‌డౌన్

కేరళ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంది.ఈ నెల 23, 30వ తేదీల్లో సంపూర్ణ లాక్ డౌన్  విధించాలని నిర్ణయం తీసుకొంది. అత్యవసర సేవలకు మాత్రమే ఈ రెండు రోజుల్లో అనుమతిని ఇచ్చింది ప్రభుత్వం.

Covid19 Total lockdown in Kerala for 2 Sundays
Author
New Delhi, First Published Jan 23, 2022, 2:16 PM IST

న్యూఢిల్లీ:  kerala  రాష్ట్రంలో Corona  కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇవాళ, ఈ నెల 30వ తేదీన ఆదివారాల్లో సంపూర్ణ Lock down లను అమలు చేసింది. ఈ రెండు రోజుల పాటు అత్యవసర సేవలను మాత్రమే అనుమంతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఆదివారం నాడు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిత్యావసర సరుకుల దుకాణాలను తెరిచి ఉంచనున్నారు. అత్యవసర పనుల కోసం వెళ్లే వారిని అనుమతించనున్నారు.ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. అత్యవసర పనుల పేరుతో ఇంటి నుండి బయటకు వచ్చే వారంతా అవసరమైన పత్రాలను నూపాల్సి ఉంటుంది. ప్రయాణాలు చేసే వారంతా ఈ మేరకు అవసరమైన పత్రాలను చూపాల్సి ఉంటుంది. H otelsలో పార్శిల్ మాత్రమే అనుమతిస్తారు, మెడికల్ స్టోర్సు, మీడియా సంస్థలు, టెలికం, ఇంటర్నెట్ సేవలకు అనుమతించారు.

కేరళ రాష్ట్రంలో శనివారం నాడు 45, 136 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో  రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 55,74,702కి చేరుకొన్నాయి. గురువారం నాడు రాష్ట్రంలో 46,387 కేసులు నమోదయ్యాయి. 

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,33,533 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,92,37,264కి చేరింది. కరోనా‌తో  24 గంటల్లో 525 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,89,409కి చేరింది. గడిచిన 24 గంటల్లో 2,59,168‌ మంది కరోనాతో మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి జయించినవారి సంఖ్య 3,65,60,650కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,87,205 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివిటీ రేట్ 17.78 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేట్ 16.87 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు 93.18 శాతం, మరణాల రేటు 1.25 శాతం, యాక్టివ్ కేసులు 5.57 శాతంగా ఉన్నాయి.శనివారం రోజున (జనవరి 22) దేశంలో 18,75,533 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 71,55,20,580కి చేరింది.  

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 71,10,445 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,61,92,84,270కి చేరింది. 

ఇక, మహారాష్ట్రలో శనివారం కొత్తగా 46,393 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 416 ఓమిక్రాన్ కేసులు ఉన్నాయి. శుక్రవారంతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజా కేసులతో రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 74,66,420కి చేరుకుంది. తాజాగా కరోనాతో 48 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,42,071కి చేరుకుంది. రాష్ట్రంలో మరణాల రేటు 1.9 శాతంగా ఉంది. 

మరో వైపు తమిళనాడు రాష్ట్రంలో కూడా ఆదివారం నాడు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో  ఆయా రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios