Asianet News TeluguAsianet News Telugu

ఒకే హాస్పిటల్ లో 37మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్

వారికి చికిత్స అందిస్తున్న వైద్యులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఏకంగా 37మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ గా తేలింది.

Covid19 surge hits delhi sir ganga ram hospital, 37 doctors test positive
Author
Hyderabad, First Published Apr 9, 2021, 10:06 AM IST

దేశంలో కరోనా మహమ్మారి వికృతరూపం దాలుస్తోంది. కరోనా ఎఫెక్ట్ పెద్దగా చూపించడం లేదు కదా.. ఎలాగూ వ్యాక్సిన్ వచ్చేసింది కదా.. అని ప్రజలు దీనిని లైట్ తీసుకున్నారు. ఇంకేముంది ఊహించని రీతిలో విజృంభించడం మొదలుపెట్టింది. ఊహకందని విధంగా రోజుకి లక్ష కరోనా కేసులు నమోదౌతున్నాయి

కరోనా సోకిన తర్వాత కొద్దిగా ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ అవ్వగానే వెంటనే అందరూ ఆస్పత్రులకు పరిగెడుతున్నారు. కాగా.. వారికి చికిత్స అందిస్తున్న వైద్యులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఏకంగా 37మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ గా తేలింది.

దిల్లీలోని సర్​ గంగారామ్​ ఆసుపత్రిలో పనిచేసే 37 మంది వైద్యులకు కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని గురువారం సాయంత్రం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం డాక్టర్లు హోం ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపాయి.

దిల్లీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే 7,437 మందికి పాజిటివ్​గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 7 లక్షలకు చేరువైంది. మరో 24 మంది మృతి చెందారు.

కాగా, గత కొన్ని రోజులుగా ఆసుపత్రులకు వస్తున్న కరోనా రోగుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో బెడ్లు నిండుకున్నాయి. వీరిలో పలువురు హెల్త్ కేర్ వర్కర్లు కూడా ఉన్నారని అధికారులు అంటున్నారు. ఇక సర్ గంగారామ్ ఆసుపత్రిలో కరోనా బారిన పడిన వైద్యుల్లో చాలా మంది యువకులేనని, వారిలో అత్యధికులు వ్యాక్సిన్ తీసుకున్నారని ఉన్నతాధికారులు వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ కరోనా రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా వారు ఎవరెవరిని కలిశారన్న విషయమై విచారణ ప్రారంభించామని, కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తూ, వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ వైద్యుల్లోని చాలా మందిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ 37 మందిలో 32 మంది ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారని, మిగతావారికి మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోందని అధికారులు తెలిపారు. దాదాపు ఏడాదిగా వీరంతా కరోనా సోకిన వారితోనే గడుపుతూ వచ్చారని వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios