Asianet News TeluguAsianet News Telugu

సింహాలపై కరోనా కొత్త వేరియంట్ పంజా..!

దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియాలోని జంతుప్రదర్శనశాలలో ఉన్న సింహాలు, ప్యూమాలకు  అక్కడి సిబ్బంది నుంచి కరోనా సోకింది.  కరోనా సోకగా.. 23 రోజుల తర్వాత అవి కోలుకున్నాయని అక్కడి అధికారులు అధికారికంగా ప్రకటించారు.

Covid19 Infected Lions Raise New Variant Worry In South Africa
Author
Hyderabad, First Published Jan 19, 2022, 12:01 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. ఈ మహమ్మారి.. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో మారి మరీ.. ప్రజలపై ఎటాక్ చేస్తోంది. కాగా.. ఈ మహమ్మారి  కేవలం మనుషులపై మాత్రమే కాదు.. మూగ జీవాలపై కూడా దాడి చేస్తోంది. గతేడాది.. చాలా చోట్ల సింహాలు కరోనా బారిన పడ్డాయి.  కాగా.. ప్రస్తుతం మళ్లీ కొత్త వేరియంట్ ప్రభావం సింహాలపై పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియాలోని జంతుప్రదర్శనశాలలో ఉన్న సింహాలు, ప్యూమాలకు  అక్కడి సిబ్బంది నుంచి కరోనా సోకింది.  కరోనా సోకగా.. 23 రోజుల తర్వాత అవి కోలుకున్నాయని అక్కడి అధికారులు అధికారికంగా ప్రకటించారు.

కాగా.. మొన్నటి వరకు జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందని అందరూ అనుకున్నారు. అయితే.. మనుషుల నుంచి కూడా.. జంతువులకు కరోనా సోకుతుందని ఈ ఘటనతో రుజువైందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

సింహాలు వ్యాధిబారిన పడినట్లు గుర్తించిన తర్వాత..  సిబ్బంది కారణంగానే.. వాటికి వైరస్ సోకినట్లు తేలిందని అధికారులు చెప్పారు.  వాటి నుంచి.. ఇతరులకు కూడా సోకే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. సింహాలకు ఆహారం వేసేటప్పడు.. వాటి వద్దకు వెళ్లే సమయంలోనూ మాస్క్ లు, గ్లౌజులు ధరించక తప్పదని అధికారులు చెబుతున్నారు.

కాగా.. ఈ కరోనా మహమ్మారి కారణంగా.. జంతువులు అంతరించిపోయే ప్రమాదం ఉందని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios