కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విలయతాండవం చేస్తోందో అందరికీ తెలిసిందే. లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో.. మహమ్మారి నుంచి బయటపడటానికి అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి. ప్రజలు సైతం వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు.

అయితే.. ప్రస్తుతం వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ.. దేశంలో సరిపోను వ్యాక్సిన్ లభించడం లేదు. వ్యాక్సిన్ షార్టేజ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మోసగాళ్లు తయారౌతున్నారు. ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మోసం చేయడానికి ముందుకు వస్తున్నారు.

దాదాపు వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీనిని అవకాశంగా చేసుకొని ఫేక్ యాప్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో... దేశ ప్రజలను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్టి-ఇన్) కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ యాప్‌ల గురించి హెచ్చరిస్తున్నారు.

ఈ ఫేక్ యాప్ ల నుంచి ప్రజలకు మెసేజ్ లు వస్తున్నట్లు గుర్తించారు. దీంతో.. ఆ మెసేజ్ చూసి పలువురు ఆ యాప్స్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారట.

అలా యాప్స్ ద్వారా ప్రజల సమాచారాన్ని వారు సేకరిస్తున్నారని.. తద్వారా.. ఆ సమాచారాన్ని ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల పై కన్ను వేసి ఇలాంటి ఫేక్ యాప్స్ క్రియేట్ చేస్తున్నారని  హెచ్చరిస్తున్నారు.

పూర్తి సమాచారం కనుక్కోని.. దాని ద్వారా పాస్ వర్డ్స్ కొట్టేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ కోసం ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే టప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. 

ప్రజలు.. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే.. cowin.gov.in, cowin.gov.in వెబ్ సైట్లలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు