కోవిడ్ కొత్త వేరియంట్ ఎక్స్‌ఈపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. తాజాగా గుజరాత్‌లో కోవిడ్ ఎక్స్‌ఈ కేసు వెలుగుచూసింది.
కోవిడ్ కొత్త వేరియంట్ ఎక్స్‌ఈపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. తాజాగా గుజరాత్‌లో కోవిడ్ ఎక్స్‌ఈ కేసు వెలుగుచూసింది. మార్చి 13న ఓ వ్యక్తి కరోనా సోకగా.. అతడు వారం రోజుల్లో కోలుకున్నాడు. అయితే ఆ వ్యక్తి నమునాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా.. అతనికి కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ సోనికట్టుగా నిర్దారణ అయిందని అధికార వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.
ఈ వారం ప్రారంభంలో దేశంలోనే తొలి ఎక్స్‌ఈ వేరియంట్ కేసు ముంబైలో నమోదైనట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. ప్రస్తుతం ఉన్న ఆధారాలతో కోవిడ్ కొత్త వేరియంట్‌ను ధ్రువీకరించలేమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపినట్టుగా PIB Maharashtra గురువారం ట్విట్టర్‌లో పేర్కొంది.
ఎక్స్‌ఈ వేరియంట్‌ను ఒమిక్రాన్‌లోని బీఏ.1, బీఏ.2 సబ్ వేరియంట్లు కలిసి ఇది ఏర్పడింది. దీన్ని హైబ్రిడ్ వేరియంట్ అని కూడా పిలుస్తున్నారు. కరోనా వేరియంట్లు అన్నింట్లోకెల్లా ఎక్స్‌ఈ అత్యంత వేగంగా వ్యాపించగలదని డబ్ల్యూహెచ్‌వో ఇటీవల హెచ్చరించింది. ఒమిక్రాన్ బీఏ.2 కన్నా ఎక్స్‌ఈ 10 శాతం ఎక్కువ వేగంగా వ్యాపిస్తుందని అంచనా వేసింది.
