Asianet News TeluguAsianet News Telugu

కరోనా మహమ్మారి ఇక అంతం కాదు.. థర్డ్ వేవ్ పై డబ్ల్యూహెచ్ఓ ఏమందంటే...

కోవిడ్ బారిన పడి కోలుకున్నవారు, టీకాలు తీసుకున్న వారిపై  వ్యాధి ప్రభావం తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు.

Covid virus expected to continue to transmit for a very long time: WHO official Poonam Khetrapal Singh
Author
Hyderabad, First Published Sep 29, 2021, 7:30 AM IST

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. అయితే ఈ మహమ్మారి ఎప్పుడు అంతం అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ మహమ్మారి ఇప్పట్లో అంతం కాదని.. మరి కొన్నేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ( WHO) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ ఖత్రేపాల్ సింగ్ పేర్కొన్నారు.

కానీ... ప్రజలపై టీకాల ప్రభావం, రోగనిరోధక శక్తి పెరగడం కారణంగా వైరస్ ఓ సాధారణ ఫ్లూలా మారే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. మనం వైరస్ ఆధీనంలో ఉన్నాం కానీ.. వైరస్ మన ఆధీనంలో  ఉంది కానీ భావించకూడదు అని సీనియర్ అధికారిణి వ్యాఖ్యానించారు. కోవిడ్ బారిన పడి కోలుకున్నవారు, టీకాలు తీసుకున్న వారిపై  వ్యాధి ప్రభావం తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు.

పూనమ్ ఖత్రేపాల్ సింగ్ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. కోవిడ్ వైరస్ చాలా కాలం పాటు కొనసాగుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వ్యాధి త్వరలో అంతమవుతుందా..? సుదీర్ఘ కాలం కొనసాగుతుందా? అనే విషయం పలు రకాల అంశాల మీద ఆధారపడి ఉందన్నారు. సుదీర్ఘకాంల కొనసాగే అవకాశాలే ఉన్నప్పటికీ.. టీకాలు, రోగ నిరోధక శక్తి కారణంగా కరోనా ఓ సాధారణ ఫ్లూలా మారే అవకాశం ఉందన్నారు.

కరోనా థర్డ్ వేవ్ వస్తుందనే వార్తలపై పూనమ్ ఖత్రేపాల్ సింగ్ స్పందించారు. అది ఎంత తీవ్రంగా ఉంటుందనేది మనందరి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుదని పేర్కొన్నారు. మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగితే వైరస్ ఎక్కువ మందికి సోకే అవకాశం లేదని తెలిపారు. వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందుతున్న వారిలో టీకాలు తీసుకోనేవారే అధిక శాతం ఉన్నట్లు స్పష్టం  చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios