Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రాలూ రెడీగా ఉండండి.. మరికొన్ని వారాల్లోనే వాక్సిన్‌.. : ప్రధాని మోదీ

మరికొన్ని వారాల్లో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ తెలిపారు. ఒక్కసారి శాస్త్రవేత్తల నుంచి అనుమతి రాగానే వాక్సినేషన్‌ ప్రారంభిస్తామని, ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుందని పునరుద్ఘాటించారు. 

Covid vaccine could be ready in next few weeks, says PM Modi - bsb
Author
hyderabad, First Published Dec 4, 2020, 4:07 PM IST

మరికొన్ని వారాల్లో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ తెలిపారు. ఒక్కసారి శాస్త్రవేత్తల నుంచి అనుమతి రాగానే వాక్సినేషన్‌ ప్రారంభిస్తామని, ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుందని పునరుద్ఘాటించారు. 

కోవిడ్‌ పరిస్థితిపై చర్చించేందుకుప్రధాని మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘తక్కువ ధరలో సురక్షితమైన వ్యాక్సిన్ కోసం ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది. అందుకే అన్ని దేశాల చూపు భారత్‌ వైపే ఉంది. ఇప్పటికే టీకా ధర, పంపిణీ గురించి రాష్ట్రాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. కాబట్టి రాజకీయ పార్టీల అధినేతలందరూ మీ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయండి. వాటిని పరిగణనలోకి తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు. 

అయితే ఇప్పటికే పైజర్ కంపెనీ తాము రూపొందించిన వ్యాక్సిన్‌ 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికోసం టీకాను 70 డిగ్రీల సెల్సియస్‌ వద్ద స్టోరేజ్‌ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

ఈ అంశం గురించి ఇప్పటికే రాష్ట్రాలతో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఈ టీకాను భద్రపరిచేందుకు వీలుగా కోల్డ్‌స్టోరేజీల వివరాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తిగా చేశారు. అదే విధంగా వాక్సిన్‌ స్టాక్‌ గురించి కచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. 

‘‘ప్రస్తుతం సుమారు ఎనిమిది వాక్సిన్లు వివిధ ట్రయల్‌ దశల్లో ఉన్నాయి. భారత్‌లో క్లినికల్‌ పరీక్షలు పూర్తి చేసుకునే దిశగా మూడు కంపెనీలు ముందుకు సాగుతున్నాయి. కాబట్టి రానున్న కొన్ని వారాల్లోనే దేశంలో వాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాక్సినేషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతూ మనకు ఉన్న వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలి’’ అని శుక్రవారం నాటి భేటీలో మోదీ పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios