Asianet News TeluguAsianet News Telugu

కరోనా సెకండ్ వేవ్‌ను ఆపాలి: సీఎంలతో మోడీ

 కరోనా సెకండ్ వేవ్ ను వెంటనే ఆపాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.
 

Covid spreading exponentially, focus on micro-containment zones, PM Modi tells CMs lns
Author
New Delhi, First Published Mar 17, 2021, 2:34 PM IST


న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ను వెంటనే ఆపాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

బుధవారం నాడు ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడారు.కరోనా వైరస్ నియంత్రణ, వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరుపై ఆయన మాట్లాడారు.  ఈ సమావేశానికి ఛత్తీస్ ఘడ్, పశ్చిమబెంగాల్ సీఎంలు భూపేష్ భగేల్, మమతా బెనర్జీలు గైరాజర్హయ్యారు.

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను సాధారణ లాక్ డౌన్ కాకుండా ఒక ప్రాంతాన్ని మైక్రో జోనింగ్ ను మోడీ ప్రతిపాదించారు. ప్రతి రోజూ 30 లక్షల టీకాలు వేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. వ్యాక్సిన్ ను వేస్ట్ చేయకుండా చూడాలని మోడీ సీఎంలకు చెప్పారు. 

కరోనా వైరస్ గ్రామాలకు విస్తరించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై తరచూ సమావేశాలు నిర్వహించుకొందామని ఆయన చెప్పారు.

దేశంలో గత కొంతకాలంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ కేసుల కట్టడికి చర్యలు తీసుకోనేందుకు సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ఏడాది పలుమార్లు మోడీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.

 

Follow Us:
Download App:
  • android
  • ios