కరోనా రోగులను జంతువుల కంటే హీనంగా చూస్తారా?: కేజ్రీ సర్కార్‌పై సుప్రీం ఫైర్
కరోనా రోగులకు అందిస్తున్న చికిత్సతో పాటు కరోనాతో మరణించిన వారి మృతదేహాలకు అంత్యక్రియలపై సుప్రీంకోర్టు న్యూఢిల్లీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.ఢిల్లీలో కరోనా రోగులను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ: కరోనా రోగులకు అందిస్తున్న చికిత్సతో పాటు కరోనాతో మరణించిన వారి మృతదేహాలకు అంత్యక్రియలపై సుప్రీంకోర్టు న్యూఢిల్లీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.ఢిల్లీలో కరోనా రోగులను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
చెత్తకుప్పలో కూడ కరోనా మృతదేహాలు కన్పించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న మార్చురీలో మృతదేహాలను భద్రపర్చే విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
also read:కరోనా సోకిన యువతికి ఊపిరితిత్తుల మార్పిడి: భారత సంతతి డాక్టర్ నేతృత్వం
ఢిల్లీలో ప్రతి రోజూ కేవలం ఐదు వేల పరీక్షలే చేయడంపై కూడ సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పరీక్షలను ఎందుకు తగ్గించారని కోర్టు ప్రశ్నించింది. కరోనా పరీక్షల నిర్వహణలో తొలుత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే ముందున్న ఢిల్లీ ప్రస్తుతం ఎందుకు కేసులను తగ్గించిందని కోర్టు ప్రశ్నించింది.
చెన్నై, ముంబై నగరాల్లో కరోనా పరీక్షల సంఖ్య ప్రతి రోజూ కనీసం 17 వేలకు చేరుకొన్న విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడ కరోనా కేసులపై ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
కరోనా కేసుల సంఖ్యను చూస్తే పరిస్థితులు భయానకంగా ఉన్నట్టుగా కన్పిస్తోందన్నారు. అన్ని రాష్ట్రాలు కరోనా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తామని ప్రకటించింది.