Asianet News TeluguAsianet News Telugu

రోడ్డుపైకి కరోనా రోగులు... భయంతో పరుగులు తీసిన జనాలు

తమకు సదుపాయాలు కల్పించడంలేదంటూ తమిళనాడులో కరోనా రోగులు ధర్నాలు చేపట్టారు. మంగట్‌ ప్రాంతంలోని కరోనా బాధితులందరూ కట్టగట్టుకొని రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 
 

Covid Patients Stage Protest In Chennai Alleging Improper Medical Care
Author
Hyderabad, First Published Jul 24, 2020, 11:16 AM IST

కరోనా వైరస్ మన దేశంలో విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వరసగా రెండు రోజుల పాటు దాదాపు 50వేల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో.. చికిత్స ఇవ్వడం కూడా ఇబ్బంది అవుతోంది. చాలా మందికి కనీసం ఆస్పత్రుల్లో బెడ్స్ కూడా దొరకడం లేదు. క్వారంటైన్ సెంటర్లోనూ సదుపాయాలు లభించడం లేదు. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో... అధికారులకు కూడా ఏమీ పాలుపోవడం లేదు. 

అయితే.. తమకు సదుపాయాలు కల్పించడంలేదంటూ తమిళనాడులో కరోనా రోగులు ధర్నాలు చేపట్టారు. మంగట్‌ ప్రాంతంలోని కరోనా బాధితులందరూ కట్టగట్టుకొని రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 

మంకాడు, ముత్తుకుమారు మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. తాగునీరు, సరైన ఆహారం, చికిత్స ఇవ్వడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  కరోనా బాధితులందరూ కట్టగట్టుకొని రోడ్డుపైకి రావడంతో భయపడ్డ స్థానికులు... పరుగులెత్తారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios