కరోనా కేర్ సెంటర్ల నుంచి రోగులు పారిపోతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కరోనా పాజిటివ్ అని తెలియగానే మాయమైపోవడం, అడ్రస్ లు, ఫోన్ నెం. లు తప్పుగా ఇవ్వడం లాంటి సంఘటనలూ అక్కడడక్కడ చోటు చేసుకుంటున్నాయి. 

తాజాగా త్రిపుర రాష్ట్రంలోని అంబస్సాలోని కరోనా కేర్ సెంటర్ నుంచి 25 మంది కోవిడ్ రోగులు తప్పించుకుని పారిపోయిన ఘటన సంచలనం రేపింది. పారిపోయిన కోవిడ్ రోగుల కోసం పోలీసులు గాలించగా వారిలో ఏడుగురిని రైల్వేస్టేషన్ లో పట్టుున్నారు.

అంబస్సా పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ భవనంలో తాత్కాలికంగా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను ఉంచారు. కోవిడ్ కేర్ కేంద్రం నుంచి 25 మంది కరోన రోగులు పారిపోవడంతో అన్ని పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లకు సమాచారం అందించి వారిని అప్రమత్తం చేశారు.