ఆరోగ్యం క్షీణించి మే 9వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన పెద్ద కుమారుడు జషోబంత, మరో కుమారుడు ప్రశాంత కూడా కరోనా బారిన పడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.

ప్రముఖ శిల్పి, రాజ్యసభ సభ్యుడు, పద్మ విభూషణ్ గ్రహీత రఘునాథ్ మహా పాత్ర ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా మహమ్మారి వారి ఇంట్లో తీవ్ర విషాదన్ని నింపింది. పది రోజుల వ్యవధిలో ఎంపీ రఘునాథ్, ఆయన ఇద్దరు కుమారులు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

కరోనా సోకడంతో ఏప్రిల్ 22 న రఘునాథ్(78) భువనేశ్వర్ లోని ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించి మే 9వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన పెద్ద కుమారుడు జషోబంత, మరో కుమారుడు ప్రశాంత కూడా కరోనా బారిన పడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.

అక్కడ చికిత్స పొందుతూ ప్రశాంత్ బుధవారం ప్రాణాలు కోల్పోగా.. పెద్ద కుమారుడు జషోబంత శుక్రవారం తుదిశ్వాస విడిచాడు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న 8ఏళ్ల వయసులోనే రఘునాథ్ శిల్పిగా మారాడు. కాగా 2018లో రాజ్యసభకు నామినేటెడ్ ఎంపీగా ఎంపికయ్యారు. 

ఆయన ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2013లో పద్మ విభూషణ్ తో సత్కరించింది. ఆయన కుమారుడు ప్రశాంత్ ఒడిశా రంజీ ట్రోఫీ క్రికెట్ జట్టుకు సారథిగా బాధ్యతలు నిర్వహించారు.