కోవిడ్ ఎఫెక్ట్: మాస్కులు త‌ప్ప‌నిస‌రి చేస్తూ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు

Mumbai: మహారాష్ట్రలోని సతారాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ అధికార యంత్రాంగం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల పరిశుభ్రత పాటించాలని ప్ర‌జ‌ల‌కు సూచించింది.
 

Covid effect: Govt issues orders making it mandatory to wear masks in Maharashtra's Satara RMA

Mandatory For Government Employees: దేశంలోని ప‌లు ప్రాంతాల్లో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయ‌ని వైద్య నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మై చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. మహారాష్ట్రలో ప్ర‌స్తుతం కోవిడ్ -19 కేసుల‌తో పాటు ఇన్ ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా సతారా  జిల్లాలో ప‌రిస్థితి దారుణంగా మారుతోంది. దీనిని  నివారించ‌డానికి జిల్లా యంత్రాంగం చ‌ర్య‌లు చేప‌ట్టింది. కోవిడ్ -19, ఇన్ ఫ్లూయెంజా వ్యాప్తిని నివారించే చ‌ర్య‌ల్లో భాగంగా మాస్కులు ధ‌రించ‌డంతో పాటు కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించింది. 

సతారాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ అధికార యంత్రాంగం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల పరిశుభ్రత పాటించాలని ప్ర‌జ‌ల‌కు సూచించింది. ప్రభుత్వ, సెమీ-గవర్నమెంట్ కార్యాలయాలు, కళాశాలలు, బ్యాంకులలో పనిచేసే ఉద్యోగులు, అధికారులకు మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. ఈ నిబంధ‌న‌లు తక్షణమే అమల్లోకి వచ్చేలా సతారా కలెక్టర్ రుచేష్ జైవంశీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లాలోని వారపు సంతలు, బస్టాండ్లు, సభలు, పెళ్లిళ్లు వంటి రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతుల పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19, ఇన్ ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రజారోగ్య శాఖను ఆదేశించామని, ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్ కార్యాలయాలు, కళాశాలలు, బ్యాంకుల్లో పనిచేసే అధికారులతో సహా ఉద్యోగులకు మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ జైవంశీ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా యంత్రాంగం విడుదల చేసిన నోట్ లో పేర్కొంది.

మహారాష్ట్రలో సోమవారం కొత్తగా 248 కరోనావైరస్ కేసులు, ఒక మరణం నమోదయ్యాయ‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇన్ఫెక్షన్ల సంఖ్య 81,45,590 కి పెరిగింది. తాజా మ‌ర‌ణంతో క‌లిపి మ‌హారాష్ట్రలో మొత్తం కోవిడ్ తో చ‌నిపోయిన వారి సంఖ్య 1,48,445 కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అంతకుముందు రోజు రాష్ట్రంలో 562 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,532గా ఉందని అధికారులు సోమవారం తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios