Asianet News TeluguAsianet News Telugu

గెలుపు కోసం పోరాటం: ఐసీసీ 95వ వార్షికోత్సవంలో మోడీ

నిరంతరం గెలుపు కోసం పోరాటం చేయాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఛాలెంజ్‌లను ఎదుర్కొన్నవారే విజేతలవుతారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో మనమంతా పోరాటం చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు.

Covid crisis will be turning point for India's growth story, says PM
Author
New Delhi, First Published Jun 11, 2020, 11:50 AM IST


న్యూఢిల్లీ:నిరంతరం గెలుపు కోసం పోరాటం చేయాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఛాలెంజ్‌లను ఎదుర్కొన్నవారే విజేతలవుతారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో మనమంతా పోరాటం చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు.

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ వార్షికోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. విదేశాలపై ఆధారపడడం తగ్గించుకొనేందుకే ఆత్మ నిర్భర్ భారత్  అని మోడీ స్పష్టం చేశారు. భారత్ ఎగుమతులపై ప్రపంచంలోని అనేక దేశాలు ఆధారపడ్డాయన్నారు. 

Covid crisis will be turning point for India's growth story, says PM

ఐకమత్యమే మన బలమని ఆయన ప్రకటించారు.  ఇది పరీక్షా కాలం. అయినా కూడ ఓటమిని ఒప్పుకోవదన్నారు. నిరంతరం గెలుపుకోసం ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు.

also read:ఒకే రోజు రికార్డు స్థాయిలో కేసులు: మొత్తం కరోనా కేసులు 2,86,579కి చేరిక

దేశం తన కాళ్లపై తాను నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా, తుఫానులు, మిడతల దాడులు వంటి ఉపద్రవాలు వరుసుగా దేశాన్ని ముంచెత్తాయన్నారు. 
రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం ఐసీసీ సహాయం చేయాలని మోడీ సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios