కేరళలో కోవిడ్ కేసులు : వృద్ధులు తప్పనిసరి మాస్కులు ధరించాలి.. కర్ణాటక ఆరోగ్యశాఖామంత్రి
సీనియర్ సిటిజన్లు, కొమొర్బిడిటీ ఉన్నవారు మాస్క్‌లు ధరించాలని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కర్నాటక : కర్నాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండూరావు సోమవారం సీనియర్ సిటిజన్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కేరళ, ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలా వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, దేశంలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. నానాటికి పెరుగుతున్న కేసుల సంఖ్య భయాందోళనలు కలిగిస్తోంది. కేంద్ర మంత్రిత్వ శాఖ దీనిపై వివరాలు వెల్లడించింది. ఆదివారం కొత్తగా కోవిడ్ 19 కేసులు 335 నమోదయ్యాయి. ఇప్పటివరకు యాక్టివ్ కేసుల సంఖ్య వీటితో కలిపి 1,701కి చేరుకుంది. ఇప్పటివరకు కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందాడు.
వీరిలో ఒక్క కేరళలోనే నలుగురు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఒకరు మృతి చెందారు. ఈసారి కోవిడ్ వేరియంట్... జేఎన్.1 గా చెబుతున్నారు. ఇది కోవిడ్ సబ్ వేరియంట్. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా కేరళ ఈ వేరియంట్ ను గుర్తించిందని చెప్పారు. దీనిపై ఎవరూ భయాందోళనకు గురి కాకూడని తెలిపారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ధీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని కోరారు.