ఇండియాలో వేగంగా విస్తరిస్తున్న కరోనా జేఎన్.1 వైరస్:2,669కి చేరిన కేసులు

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో  328 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

Covid cases in India:328 Active Cases detected in 24 hours lns

న్యూఢిల్లీ: భారత దేశంలో (ఇండియా) కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.  గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా  కొత్తగా  328 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో జేఎన్. 1 కరోనా కేసులు  వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రపంచంలోని  38 దేశాల్లో  జేఎన్.1 కరోనా వైరస్ కేసులు వ్యాప్తి చెందుతున్నాయి.  దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 2,669కి చేరుకున్నాయి. 

ఈ ఏడాది ఇదే నెలలో  కేరళ రాష్ట్రంలో జేఎన్. 1 కరోనా కేసు వెలుగు చూసింది. కేరళతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెద్ద ఎత్తున  వెలుగు చూస్తున్నాయి.  దీంతో  కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ  ఆయా రాష్ట్రాలను  అప్రమత్తం చేసింది. 

కేరళ రాష్ట్రంలోనే  అత్యధికంగా కరోనా కేసులు నమోదౌతున్నాయి.  కేరళ రాష్ట్రంలో  శబరిమల అయ్యప్ప దర్శనం కోసం భక్తులు పలు రాష్ట్రాల నుండి  వస్తున్నారు. కేరళలో ఇప్పటికే కరోనా  కేసులు నమోదైన నేపథ్యంలో  జాగ్రత్తగా ఉండాలని  కూడ  వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. 


 దేశ వ్యాప్తంగా  328 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయని  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  గత 24 గంటల్లో  కేరళ రాష్ట్రంలోనే  265 కేసులు కొత్తగా నమోదయ్యాయి.

తమిళనాడు రాష్ట్రంలో  కొత్తగా 15 కరోనా కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. 13 కరోనా కేసులు  కర్ణాటకలో రికార్డయ్యాయి.
దేశంలోని 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో  కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదు.  పశ్చిమ బెంగాల్, ఒడిశా,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్క కేసు కూడ నమోదు కాలేదు.


కర్ణాటకలో  కరోనా కేసులు  105కు చేరాయి.  మహారాష్ట్రలో కరోనా కేసులు 53కి చేరుకున్నాయి. కరోనా  బీఏ.2.286 వేరియంట్ నుండి  జేఎన్.1 కరోనా వైరస్ ఉద్భవించింది.   కరోనా జేఎన్.1 వైరస్ ఈ ఏడాది సెప్టెంబర్  మాసంలో  అమెరికాలో  వెలుగు చూసింది.  జేఎన్. 1 వైరస్ కరోనా కేసులు వారం రోజుల క్రితం చైనాలో  కూడ నమోదయ్యాయి.గురువారం నాడు  రాజస్థాన్ రాష్ట్రంలో రెండు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

గత రెండు వారాల్లో  కరోనాకు సంబంధించి 16 మంది మరణించారు.   దేశంలో కరోనా జేఎన్.1 వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆయా  రాష్ట్రాలను  కేంద్రం అలెర్ట్ చేసింది.   కరోనా పరీక్షలను పెంచాలని ఆయా రాష్ట్రాలను  కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

also read:తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా: హైద్రాబాద్ నాంపల్లిలో 14 ఏళ్ల చిన్నారికి కోవిడ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది.  తెలంగాణలో    14 నెలల చిన్నారికి కరోనా సోకింది.  హైద్రాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios