ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2లక్షల మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. మరో 18లక్షల మంది ఈ వైరస్ సోకి బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో.. ఉద్యోగులకు ఆఫీసులకు వెళ్లకుండా.. ఇళ్లకే పరిమితమయ్యారు.

చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించారు. దీంతో.. ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. ఇక మనదేశంలో కూడా దాదాపు అన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు.. డిజిటల్ టెక్నాలజీతో పనిచేసే కంపెనీలు.. ఎంప్లాయిస్‌కు వర్క్‌ ఫ్రం హోం ఇచ్చి పనిచేయిస్తున్నాయి. 

అయితే ఇప్పుడు ఇలా పనులు కొనసాగుతుండటాన్ని ఎక్స్‌పర్ట్స్‌ పరిశీలిస్తున్నారు. ఇక కరోనా నుంచి బయటపడ్డ తర్వాత కూడా ఇలా వర్క్ ఫ్రం హోంను ఉద్యోగులకు పర్మినెంట్ చేసే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా దీనిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలో కేంద్ర ప్రభుత్వం ఇంటి నుంచి పనికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల్లో వర్క్‌ చేసే ఎంప్లాయిస్‌ బెనిఫిట్స్‌ను కాపాడటమే కాకుండా.. పని గంటలు, పని వాతావరణం, శాలరీ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించనుంది. 

ఒకవేళ వర్క్‌ ఫ్రం విధానం ఇంప్టిమెంట్ చేస్తే.. ప్రత్యేక గైడ్‌లైన్స్ అవసరమని ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ఓ సీనియర్ అధికారి ఓ జాతీయ మీడియాకు తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టంలో.. “వర్క్‌ ఫ్రం హోం”కు నిర్దిష్ట మార్గదర్శకాలు లేవు. కేవలం లాక్‌డౌన్‌ నేపథ్యంలో పీఎం మోదీ.. దేశంలోని కంపెనీలను.. పనిచేసే ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంకు అనుమతివ్వండి అంటూ కోరారు.