దేశంలో రోజురోజుకూ కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ నేపత్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. 

గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించి వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా నమోదైన కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,26, 789. 

అంటే 24 గంటల్లో ఒక లక్ష కేసులు దాటడం ఇది మూడోసారి. మొత్తం కేసుల సంఖ్య 1,29,28,574కు చేరింది. అత్యధిక కోవిడ్ కేసులు నమోదైన అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. 

ఏప్రిల్ 5న నమోదైన కొత్త కేసులు 1,03,558 కాగా, ఏప్రిల్ 7న 1,15,736 కేసులు కొత్తగా నమోదయ్యాయి. గురువారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,26,789 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

దేశవ్యాక్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 9,10,319. ఈ వ్యాధి నుంచి కోలుకున్నవారు గడిచిన 24 గంటల్లో 59,258 మంది కాగా, మొత్తం మీద 1,18,51,393 మంది కోలుకున్నారు.

కరోనా రికవరీ రేటు 92.11 శాతం. కరోనా తో మొత్తం మీద 1,66,882మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 7న 12,37,781 శాంపిల్స్ ను టెస్ట్ చేశారు. మొత్తం మీద (ఐసీఎంఆర్) వెల్లడించిన టెస్ట్ చేసిన నమూనాల సంఖ్య 25,26,77,379.