Asianet News TeluguAsianet News Telugu

కరోనా డేంజర్ బెల్స్ : మే మధ్యనాటికి మరింత తీవ్రం..ఐఐటీ శాస్త్రవేత్తల హెచ్చరిక.. !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మే 11-15 మధ్యలో 33-35 లక్షల యాక్టివ్ కేసులతో పీక్ కు చేరుతుందని ఐఐటి శాస్త్రవేత్తలు రూపొందించిన మాథమెటికల్ మాడ్యూల్ ప్రకారం, తెలుస్తోంది. ఈ ప్రళయం మే చివరి నాటికి బాగా తగ్గుతుందని వారు అంటున్నారు. 

COVID-19 Second Wave In India May Peak By Mid-May, Predict Scientists At IIT - bsb
Author
Hyderabad, First Published Apr 24, 2021, 12:49 PM IST


దేశంలో కరోనా సెకండ్ వేవ్ మే 11-15 మధ్యలో 33-35 లక్షల యాక్టివ్ కేసులతో పీక్ కు చేరుతుందని ఐఐటి శాస్త్రవేత్తలు రూపొందించిన మాథమెటికల్ మాడ్యూల్ ప్రకారం, తెలుస్తోంది. ఈ ప్రళయం మే చివరి నాటికి బాగా తగ్గుతుందని వారు అంటున్నారు. 

శుక్రవారంనాడు ఒకే రోజు దేశవ్యాప్తంగా 3,32,730 కరోనాపాజిటివ్ తాజా కేసులు నమోదు కాగా కరోనాతో 2,263 మంది మరణించారు.  దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 24,28,616 లకు పెరిగింది.

తగ్గడానికి ముందు ఈ కేసులు ఓ దశలో రోజులు పడిలక్షలకు పెరిగే అవకాశం ఉందని కాన్పూర్, హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. దీన్ని అనుమానాస్పదమైనవి, గుర్తించబడినవి, రిమూవ్డ్ అప్రోచ్ అనే (SUTRA) మోడల్ తో చెబుతున్నారు.

ఏప్రిల్ 25-30 నాటికి డిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణలలో కొత్త కేసులు అధికంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. మహారాష్ట్ర,  ఛత్తీస్‌గడ్ లు ఇప్పటికే కొత్త కేసులలో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

 "దేశంలో యాక్టివ్ కేసులు మే 11-15 మధ్య 33-35 లక్షలవరకు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని కనుగొన్నాం. ఇది షార్ప్ స్లోప్.. ఇప్పుడు కేసులు అత్యంత త్వరితంగా పెరుగుతాయి. ఈ పెరుగుదల ఒక టైంలో స్థిరత్వాన్ని చూపిస్తుంది. ఆ తరువాత మే చివరినాటికి గణనీయంగా కేసుల్లో తగ్గుదల కనిపిస్తుంది’ అని ఐఐటి-కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ అన్నారు. 

కేంద్రం కీలక నిర్ణయం: రాష్ట్రాలకు ఉచితంగా కరోనా వాక్సిన్...

ఇంకా ప్రచురణ కాని ఈ అధ్యయనంలోని మరికొన్ని ముఖ్య విషయాలను ఈ సైంటిస్టులు చెబుతూ.. సూత్రా మోడల్ లో ఎన్నో నావెల్ ఫీచర్స్ ఉన్నాయన్నారు. 
ఇప్పటివరకున్న అధ్యయనాలు రోగుల్ని అసింప్టమాటిక్, ఇన్ఫెక్టెడ్ అనే విభాగాల కిందనే విభజించాయని, కానీ ఈ కొత్త మోడల్ ప్రకారం కాంటాక్ట్ ట్రేసింగ్ లాంటి ఇతర ప్రోటోకాల్స్ తో అసింప్టమాటిక్ రోగులను మరింత స్పష్టంగా గుర్తించవచ్చని తెలుపుతున్నారు. 

కాగా ఈ మ్యాథమెటిక్ మాడల్ ప్రకారం ఏప్రిల్ 15 నాటికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయస్థాయిలో పెరుగుతుందని చెప్పారు. అయితే ఇది నిజం కాలేదు. "ప్రస్తుత దశలో మా మోడల్‌లోని పారామీటర్లు నిరంతరం డ్రిఫ్టింగ్ అవుతున్నాయి, కాబట్టి సరైనా అంచనాలు చెప్పలేకపోతున్నాం’  అని అగర్వాల్ అన్నారు.

"రోజువారీ కేసుల్లో స్వల్ప మార్పు కూడా ఈ పీక్ నెంబర్స్ విషయంలో అనేక వేల సంఖ్యను తారుమారు చేస్తుంది’ అని ఆయన వివరించారు. ఈ కొత్త సూత్ర మాడల్ రోజువారీ యాక్టివ్ కేసుల డేటా విషయంలో సెన్సిటివ్ గా పనిచేస్తుందని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ అన్నారు. 

మహమ్మారిని అంచనా వేయడానికి మోడల్ మూడు ప్రధాన పారామితులను పరిగణలోకి తీసుకుంటుందని అగర్వాల్ తెలిపారు. "మొదటిదాన్ని బీటా లేదా కాంటాక్ట్ రేట్ అని పిలుస్తారు, ఇది రోజుకు ఎంత మంది సోకింది అనేదాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఇది R0 వాల్యూకి సంబంధించినది. ఇది వైరస్ సోకిన వ్యక్తి పూర్తిగా బాగయ్యేలోగా ఎంత మందికి ఇన్ ఫెక్షన్ అంటిస్తాడో లెక్కిస్తుంది..’ అని అగర్వాల్ వివరించారు.

ఇతర రెండు పారామితులు 'రీచ్', అంటే ఎంతమంది జనాభా మహమ్మారికి ఎక్స్ పోజర్ అయ్యారు అనేది ఒకటి కాగా.. ఇప్పటివరకు గుర్తించబడిన కేసులు, గుర్తించబడని కేసుల నిష్పత్తిని తెలిపే 'ఎప్సిలాన్' అనే పద్ధతి.

ఇవే కాక ఇంకా ఇతర మ్యాథమెటిక్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. హర్యానాలోని అశోక విశ్వవిద్యాలయానికి చెందిన గౌతమ్ మీనన్ తన బృందంతో చేసిన ఇండివిడ్యువల్ లెక్కల ప్రకారం.. ఏప్రిల్ మధ్య కాలంలో, మే మధ్యకాలంలో ఈ మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుతుందని అంచనా వేశారు. 

COVID-19 కేసుల ఈ అంచనాలను స్వల్పకాలికంగా మాత్రమే విశ్వాసంలోకి తీసుకోవాలని మీనన్ హెచ్చరించారు. కేవలం ఐదు రోజుల కేసుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని అంచనా వేస్తే అది అనిశ్చిత ఫలితాలు ఇస్తుందని మీనన్ హెచ్చరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios