Asianet News TeluguAsianet News Telugu

పిల్లలతోపాటు తనూ పుట్టింది.. ముగ్గురికి జన్మనిచ్చిన కరోనా బాధితురాలు..

తమిళనాడులో ఆసక్తికర విషయం జరిగింది. కరోనాతో బాధపడుతున్న ఓ మహిళ ఏకంగా ముగ్గురికి జన్మనిచ్చింది. చెన్నై, తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రిలో ఆమె ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. కాగా ఆమె, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Covid-19 positive woman gives birth to triplets in tamilnadu - bsb
Author
Hyderabad, First Published Jun 17, 2021, 9:57 AM IST

తమిళనాడులో ఆసక్తికర విషయం జరిగింది. కరోనాతో బాధపడుతున్న ఓ మహిళ ఏకంగా ముగ్గురికి జన్మనిచ్చింది. చెన్నై, తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రిలో ఆమె ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. కాగా ఆమె, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

తూత్తుకుడి సమీపంలోని కోరంపల్లికి చెందిన విద్య గర్భవతి. కాగా, గత నెల 28న ఆమెకు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు, ఆమెకు కరోనా పాజిటివ్ అని తేల్చారు. అంతేకాదు ఆమెకు ఆక్సీజన్ స్థాయిలు తగ్గిపోవడంతో వైద్యులు తగిన చికిత్స అందించారు. 

దీనికి తోడు ఆమె కాలేయం దెబ్బతిన్నట్లు తేలడంతో ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు 15రోజుల క్రితం కాలేయ శస్త్రచికిత్స చేశారు. అదే యమంలో ఆమెకు శస్త్రచికిత్స చేయగా, ముగ్గురు ఆడశిశువులకు జన్మనిచ్చింది. ఒక శిశువు బరువు 1.5 కిలోలు, మరో శిశువు 1.75 కిలోలు, 3వ శిశువు 1.3 కిలోల బరువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే తల్లికి కరోనా రావడంతో కృత్రిమ ఆక్సీజన్ అందించారు. అంతేగాక రోగ నిరోధక శక్తిని పెంచే మందులు అందించారు. దీంతో వారంతా పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తల్లీ పిల్లలు క్షేమంగా ఉండడంతో మంగళవారం వారిని డిశ్చార్జ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios