Asianet News TeluguAsianet News Telugu

నవంబర్ నాటికి ఇండియాలో కరోనా పీక్: 'వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్స్ కొరత'

ఈ ఏడాది నవంబర్ నాటికి కరోనా కేసులు పీక్ కు చేరుకొంటాయని ఐసీఎంఆర్ అధ్యయనం తేల్చింది. నవంబర్ లో ఐసీయూలో పడకలు, వెంటిలేటర్ల కొరత ఏర్పడవచ్చని ఐసీఎంఆర్ అంచనా వేసింది.
 

COVID-19 peak in India may arrive mid-Nov, paucity of ICU beds, ventilators likely: ICMR Study
Author
New Delhi, First Published Jun 14, 2020, 6:40 PM IST


న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్ నాటికి కరోనా కేసులు పీక్ కు చేరుకొంటాయని ఐసీఎంఆర్ అధ్యయనం తేల్చింది. నవంబర్ లో ఐసీయూలో పడకలు, వెంటిలేటర్ల కొరత ఏర్పడవచ్చని ఐసీఎంఆర్ అంచనా వేసింది.

లాక్ డౌన్ కారణంగా దేశంలో కరోనా వ్యాప్తి ఆలస్యమైందని  ఐసీఎంఆర్ అధ్యయంన తేల్చింది. కరోనా వైరస్ వ్యాప్తి 34 నుండి 76 రోజుల పాటు వాయిదా పడింది. 69 నుండి 97 శాతం ఇన్స్ పెక్షన్ రేటు తగ్గించడానికి కారణమైందని అధ్యయనంలో తేలింది.

లాక్ డౌన్ సమయంలో కరోనా వైద్య సేవలతో పాటు మౌళిక వసతుల కల్పనపై దృష్టి పెట్టకపోతే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని ఈ అధ్యయనం అభిప్రాయపడింది.

also read:ఇండియాపై కరోనా పంజా:కోవిడ్ మరణాలలో టాప్‌టెన్‌లో భారత్‌కి చోటు

ప్రజారోగ్య వ్యవస్థను 80 శాతం పెంచి కరోనాను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకొన్నట్టుగా చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు గాను జీడీపీలో 6.2 శాతం ఉండొచ్చిన పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది నవంబర్ నాటికి కరోనా రోగులకు అవసరమయ్యే చికిత్సతో పాటు పరికరాలు  కూడ అందుబాటులో ఉంటాయన్నారు. ఆ తర్వాతే డిమాండ్ కు తగ్గట్టుగా వెంటిలేటర్లు, బెడ్స్ అందుబాటులో ఉండకపోవచ్చని ఈ అధ్యయనం తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios