కరోనా సోకిన యువకుడు, అతని కుటుంబసభ్యులు పారిపోవడంతో 40 కుటుంబాలకు చిక్కు తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాకు చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల క్రితం ఢిల్లీకి వలస వచ్చింది.

అనంతరం ఢిల్లీ నుంచి ఈ నెల 15వ తేదీన తమ సొంత గ్రామమైన తెర్వాదహిగావన్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ తర్వాతి రోజు వారు ఓ పెళ్లి వేడుకకి హాజరయ్యారు. అయితే వీరి కుటుంబంలో ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించడంతో రక్తనమూనాలను వైద్యులకు అప్పగించారు.

Also Read:మహరాష్ట్రపై కరోనా పంజా: ఒక్కరోజే 88 మంది పోలీసులకు కోవిడ్, ఒక్కరు మృతి

మొత్తం కుటుంబసభ్యులైన ఆరుగురిలో 18 ఏళ్ల యువకుడికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు, ఆ కుటుంబం వద్దకు చేరుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన కుటుంబసభ్యులు అధికారులు వచ్చేలోపే పారిపోయారు.

Also Read:కరోనాకు మందు కనిపెట్టిన హైద్రాబాద్ హెటిరో: కోవిఫోర్‌ పేరుతో మార్కెట్లోకి విడుదల

ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే పెల్లి వేడుకలో పాల్గొన్న 40 కుటుంబాలను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతనితో పాటు కుటుంబసభ్యుల కోసం గాలిస్తున్నారు. కాగా భారతదేశంలో ఇప్పటివరకు 4,12,788 మందికి పాజిటివ్‌గా తేలగా, 13,290 మంది ప్రాణాలు కోల్పోయారు.