దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కాస్త అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. పలు రాష్ట్రాలు విధించిన లాక్ డౌన్లు, వైరస్ కట్టడి ఆంక్షలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కోవిడ్ మృతుల సంఖ్య మాత్రం కలవరం పుట్టిస్తోంది. దేశంలో సంఖ్య 3 లక్షలు దాటింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కాస్త అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. పలు రాష్ట్రాలు విధించిన లాక్ డౌన్లు, వైరస్ కట్టడి ఆంక్షలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కోవిడ్ మృతుల సంఖ్య మాత్రం కలవరం పుట్టిస్తోంది. దేశంలో సంఖ్య 3 లక్షలు దాటింది.
ఆదివారం 19,28,127 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 2,22,315 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. క్రితంరోజుతో పోల్చితే స్వల్ప తగ్గుదల కనిపించింది. మరోవైపు, 24 గంటల వ్యవధిలో మరోసారి భారీగా మరణాలు సంభవించాయి.
నిన్న 4,454 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు 2,67,52,447 మందికి కరోనా సోకగా.. 3,03,720 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీల కేసులు రోజు రోజుకూ తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. తాజాగా 27,20,716 మంది కోవిడ్ తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 10.17 శాతానికి చేరింది.
నిన్న ఒక్కరోజే 3,02,544 మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 2.37 కోట్లకు పై బడ్డాయి. రివకరీ రేటు 88.69 శాతానికి చేరింది. మరోవైపు నిన్న 9,47,722 మందికి టీకాలు అందాయి. మొత్తంగా 19.60 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.
అలోపతిపై వ్యాఖ్యలు : రామ్ దేవ్ బాబాకు హర్షవర్షన్ ప్రశంస.. ‘అదీ ఆయన మెచ్యూరిటీ’ అంటూ కితాబు.....
తమిళనాడులో అత్యథిక కేసులు.. నిన్నటి కొత్త కేసుల్లో అత్యధికంగా తమిళనాడులోనే వెలుగు చూశాయి. ఆ రాస్ట్రంలో 35,483 మందికి కరోనా సోకింది. అలాగే 422 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న సంభవించిన మరణాల్లో మహరాష్ట్ర వాటానే ఎక్కువ.
ఆ రాష్ట్రంలో రికార్డైన మరణాల సంఖ్య 1,320 గా ఉంది. ఆ తరువాత స్తానంలో కర్ణాటక (624)గా ఉంది. కర్నాటక, కేరళలో 25 వేలకు పైగా కేసులు నమోదైనప్పటికీ.. మరణాల పరంగా రెండు రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. నిన్న కేరళలో 188 మంది ప్రాణాలు వదిలారు.
