న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి విధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.  వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉంటాయని కేంద్రం తేల్చి చెప్పింది.

కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  ప్రస్తుతం ఉన్న నిబంధనలే జనవరి 31 వరకు వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది.

కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.కంటైన్మెంట్ జోన్ల గుర్తింపు, ఆయా జోన్లలో కఠినంగా ఆంక్షలను అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాల్సిందిగా కోరింది.

నవంబర్ 25న కేంద్ర హోం, ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు తెలిపింది.బ్రిటన్ లో కరోనా కలకలం సృష్టించిన నేపథ్యంలో వైరస్ కట్టడి కోసం కేంద్రం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది.