మనీల్యాండరింగ్ కేసులో జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈడీ జారీ చేసిన సమన్లపై స్టే విధించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది

మనీల్యాండరింగ్ కేసులో జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈడీ జారీ చేసిన సమన్లపై స్టే విధించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది.

మార్చి 15న తమ ఎదుట విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈ నెల ప్రారంభంలో మెహబూబా ముఫ్తీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమన్లను కొట్టివేయాలని కోరుతూ ముఫ్తీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. సమన్లను కొట్టివేసేందుకు నిరాకరించింది. అయితే తాత్కాలికంగా ఈ నోటీసులను నిలిపివేస్తున్నట్లు ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 18కి విచారణ వాయిదా వేసింది.

దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ నెల 22న విచారణకు రావాలంటూ మెహబూబా ముఫ్తీకి సమన్లు ఇచ్చారు. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

ఈడీ అధికారుల ముందు ముఫ్తీ విచారణకు హాజరుకావాల్సిందేనని ఆయన కోర్టుకు విన్నవించారు. కాగా జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో దాదాపు ఏడాది పాటు ఆమె నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే.