KGF Copyright Case: 'భారత్ జోడో యాత్ర'ప్రమోషనల్ భాగంగా KGF చాప్టర్-2లోని సంగీతాన్ని ఉపయోగించి  వీడియోలను రూపొందించారని  MRT మ్యూజిక్‌ అధినేత రాహుల్ గాంధీ,ఇతరులపై కాపీరైట్ కేసును నమోదు చేశారు. ఆ కేసును కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది

KGF Copyright Case: కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీకి కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. KGF చాప్టర్-2 చిత్రంలోని సంగీతాన్ని అనుమతి లేకుండా వినియోగించుకున్నారని ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, జైరామ్ రమేష్, సుప్రియా శ్రీనాట్‌లపై కాపీరైట్ ఉల్లంఘన కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదయిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. కాంగ్రెస్ నేత పిటిషన్ ను కొట్టివేస్తూ జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ బుధవారం కీలక తీర్పు వెలువరించింది.

అసలేం జరిగింది ? 

భారత్ జోడో యాత్ర ప్రమోషనల్ భాగంగా KGF చాప్టర్-2లోని సంగీతాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పలు వీడియోలను రూపొందించింది. ఈ విషయాన్ని సిరీయస్ గా తీసుకున్న MRT మ్యూజిక్‌ అధినేత ఎం నవీన్ కుమార్ .. రాహుల్ గాంధీ, ఇతరులపై బెంగళూరులోని యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాపీరైట్ కేసును నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కాపీరైట్ కేసును కొట్టివేయాలని కాంగ్రెస్ నేతలు కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖాలు చేశారు. 

కానీ ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేస్తూ.. “పిటిషనర్లు అనుమతి లేకుండా సోర్స్ కోడ్‌ను తారుమారు చేసినట్లు తెలుస్తోంది, ఇది నిస్సందేహంగా కంపెనీ కాపీరైట్‌ను ఉల్లంఘించినట్లు అవుతుంది. పిటిషనర్లు కంపెనీ కాపీరైట్‌ను మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అందువల్ల ప్రాథమికంగా వీటన్నింటిని సాక్ష్యంగా దర్యాప్తులో ట్రాష్ చేయవలసి ఉంటుంది." అని పేర్కొంది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120-బి (నేరపూరిత కుట్ర), 403 (దుర్వినియోగం) 465 (ఫోర్జరీ), కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 33, సెక్షన్ 66 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.

అదే సమయంలో ఈ కేసులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం.. ఈ అంశం కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించినదని కాంగ్రెస్ నాయకుల తరపున వాదించారు. అయితే ఈ విషయంపై క్రిమినల్ ఫిర్యాదు, పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాపీరైట్‌ అనేది చట్టబద్ధమైన హక్కు. కాగ్నిజబుల్‌ నేరం కాదని కాంగ్రెస్ పార్టీ నేతల తరపు న్యాయవాది ఏఎస్‌ పొన్నన్న వాదించారు. వాణిజ్య కోర్టులో సంబంధిత వ్యాజ్యం దాఖలైంది. ఇది కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతాలను స్తంభింపజేయడానికి దారితీసింది. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి ఆక్షేపణీయ వీడియోలను తొలగించాలని పార్టీ తీసుకున్న హామీ తర్వాత కోర్టు దానిని పక్కన పెట్టింది.