మైనర్ బాలికపై ఓ బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడ్డాడు.  బాలికను బలవంతంగా లాక్కెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడటం గమనార్హం. ఈ సంఘటన గోవాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గోవా రాష్ట్రంలోని పనాజీ నగరానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అటానాసియో మోన్సర్రేట్ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను బలవంతంగా లాక్కెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. కాగా... ఈ దారుణ ఘటనపై గోవా కోర్టు విచారణకు స్వీకరించింది. అత్యాచారం చేసిన ఎమ్మెల్యే అటానాసియో మోన్సెర్రేట్ పై ఐపీసీ సెక్షన్ 376, 506, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఉన్నవ్ లో బీజేపీ ఎమ్మెల్యే మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన ఘటన దర్యాప్తు జరుగుతుండగానే గోవాలో మరో బీజేపీ ఎమ్మెల్యే ఈ దారుణానికి పాల్పడటం విశేషం.