సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్ కు జైలు శిక్ష పడింది. 2019 ఎన్నికల సమయంలో ఆయన విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు ఆయనను నేడు దోషిగా తేల్చింది. 

సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజం ఖాన్ ను ఉద్వేగభరితమైన ప్రసంగాలు చేసిన కేసులో కోర్టు దోషిగా తేల్చింది. అయినకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.2000 వేల జరిమానా వేసింది. దీంతో ఖాన్ శాసన సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది.

Scroll to load tweet…

ఏమిటా కేసు ? 
ఈ ద్వేషపూరిత ప్రసంగం 2019 లోక్ సభ ఎన్నికలకు సంబంధించినది. రాంపూర్ లోని మిలక్ కొత్వాలిలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, అప్పటి డీఎం ఐఏఎస్ ఆంజనేయ కుమార్ సింగ్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ నేత ఆకాశ్ సక్సేనా ఫిర్యాదు చేశారు. విద్వేష పూరిత ఆరోపణలపై అజామ్ ఖాన్ పై ఐపీసీ సెక్షన్ 153ఎ (రెండు గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 505-1 (ప్రజా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటన) కింద కేసు నమోదైంది. ఈ కేసులో రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు అక్టోబర్ 27వ తేదీ (నేడు) తీర్పు వెలువరిస్తూ ఆజం ఖాన్ ను దోషిగా తేల్చింది. 

ప్రముఖ అస్సామీ నటుడు నిపోన్ గోస్వామి కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని మోడీ, సీఎం హిమంత శర్మ

ఆజం ఖాన్ తరపు న్యాయవాది వినోద్ శర్మ మాట్లాడుతూ.. ‘‘మేము మా వాదనను పూర్తి చేశాం. అవి ఆజం ఖాన్ ప్రసంగాలు కావు. వాటిని నకిలీ పద్దతిలో తయారు చేశారు. ఖాన్ అలాంటి ద్వేషపూరిత ప్రసంగం చేయలేదు ’’ అని ఆయన వాదనలు వినిపించారు. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఈ ఏడాది ప్రారంభంలో ఆజం జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై అవినీతి, దొంగతనంతో పాటు దాదాపు 90 కేసులు ఉన్నాయని ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఓ కథనంలో నివేదించింది.