ఓ వ్యక్తి...ఇంట్లోకి అవసరమైన వస్తువులను ఓ కొరియర్ కంపెనీలో పార్శిల్ బుక్ చేశాడు.  ఆ పార్సిల్ ఇంటికి కూడా వచ్చింది. ఆర్డర్ చేసిన వస్తువు ఎలా ఉందో అని ఆశగా ఓపెన్ చేస్తే... అందులో పాము ఉండటం విశేషం. దానిని చూసి ఆ వ్యక్తి  షాకయ్యాడు. తర్వత తేరుకొని పాముని స్నేక్ క్యాచర్స్ కి అప్పగించాడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన ముత్తుకుమరన్ అనే వ్యక్తి ప్రస్తుతం ఒడిషాలోని మయూర్ భంజ్ లోని రైరంగాపూర్ లో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇంట్లోకి అవసరమయ్యే కొన్ని వస్తువులను ఓ కొరియర్ కంపెనీలో పార్శిల్ బుక్ చఏశఆడు.  ఆ కొరియర్ ఇటీవల ఇంటికి చేరింది. ఆ వస్తువును చూద్దామని పార్శిల్ ఓపెన్ చేశాడు.

ఆ పార్శిల్ లో అతను కొన్న వస్తువుతో పాటు బుసలు కొడుతున్న పాము కూడా ఉంటం విశేషం. ముందు దానిని చూసి బయపడ్డాడు. తర్వాత వెంటనే ఈ విషయాన్ని అటవీ శాఖ , స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించాడు. వాళ్లు వచ్చి  పామును పట్టుకొని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు. పదిహేను రోజుల కిందట తాను ప్రైవేట్‌ కొరియర్‌ ఏజెన్సీ నుంచి పార్సిల్‌ను బుక్‌ చేశానని ముత్తుకుమరన్‌ తెలిపారు. ఈనెల 9న గుంటూరు నుంచి ఈ పార్సిల్‌ తనకు పంపారని చెప్పారు. గృహోపకరణాలతో కూడిన ఈ పార్సిల్‌ను విప్పిచూస్తుండగా అందులో​ పాము కనిపించడంతో షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఒడిషాకు పార్సిల్‌ను తరలించే క్రమంలో పాము ఇందులోకి చేరిఉంటుందని ఆయన చెప్పారు.