Asianet News TeluguAsianet News Telugu

ఓయో గదుల్లో సీక్రెట్ కెమెరాలు.. దంపతుల బెడ్‌రూమ్ వీడియోలు తీసి, ఎలా పెడతారో తెలుసా..?

ఓయో గదుల్లో సీక్రెట్ కెమెరాల ద్వారా దంపతుల బెడ్‌రూమ్ వీడియోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠా గుట్టును నోయిడా పోలీసులు రట్టు చేశారు. ఈ సందర్భంగా 11 లాప్‌టాప్‌లు, 21 ఫోన్‌లు, 22 ఏటీఎం కార్డులతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
 

Couples At OYO Rooms Secretly Filmed, 4 Arrested In UP's Noida
Author
First Published Oct 22, 2022, 6:59 PM IST

ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పారిశ్రామిక నగరం నోయిడాలో దారుణం జరిగింది. ఓయో రూమ్‌లో బసచేసే దంపతుల బెడ్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి , వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే... కొందరు ఓ ముఠాగా ఏర్పడి నోయిడాలోని ఓయో హోటల్స్‌ను టార్గెట్ చేసుకున్నారు. ఏదో పని వుందని చెప్పి సదరు హోటళ్లలో దిగి.. ఎవరికీ తెలియకుండా బాత్రూమ్, బెడ్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టిన అనంతరం ఈ ముఠా సభ్యులు హోటల్ చెక్ అవుట్ చేసేవారు. 

ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఇలాగే ఓ ఓయో రూమ్‌ని దంపతులు బుక్ చేసుకున్నారు. వారి బెడ్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు వున్నట్లు వారికి తెలియదు. వచ్చిన పని చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. అయితే ఈ కిలాడీ ముఠా హోటల్ బెడ్‌రూమ్‌లో అమర్చిన సీక్రెట్ కెమెరాలో దంపతులిద్దరూ సన్నిహితంగా వున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో వారిని ట్రాక్ చేసిన ముఠా సభ్యులు.. డబ్బులు ఇవ్వకపోతే, సదరు వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. 

ALso Read:లేడీస్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరాలు, ఇంటర్నెట్ లో వీడియోలు, ప్రేయసిని చూసి..

దీనిపై ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓయో హోటల్ నిర్వాహకులు, సిబ్బంది పాత్ర ఇందులో లేదని తేల్చారు. ఆ తర్వాతే పోలీసులకు ఈ ముఠా సంగతి తెలిసిందే. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు.. ఆయా గ్యాంగ్‌ల స్థావరాలపై దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా 11 లాప్‌టాప్‌లు, 21 ఫోన్‌లు, 22 ఏటీఎం కార్డులతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విష్ణు సింగ్, అబ్దుల్ వాహవ్, పంకజ్ కుమార్, అనురాగ్ కుమార్ సింగ్‌లు గుర్తించారు. ఈ ముఠాకు చెందిన మరో సభ్యుడు పరారీలో వుండటంతో అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios