Asianet News TeluguAsianet News Telugu

లాటరీ దెబ్బ : ముగ్గురు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

తమిళనాడులో ఓ స్వర్ణకారుడు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. అప్పుల బాధ తట్టుకోలేక, ఇల్లీగల్ లాటరీ టికెట్ కొని మోసపోయి.. ఆ స్వర్ణకారుడు భార్యకు, ముగ్గురు పిల్లలకు సైనెడ్ ఇచ్చి, తానూ తీసుకుని చనిపోయారు. 

Couple three children, found dead in Villupuram - bsb
Author
Hyderabad, First Published Dec 14, 2020, 12:00 PM IST

తమిళనాడులో ఓ స్వర్ణకారుడు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. అప్పుల బాధ తట్టుకోలేక, ఇల్లీగల్ లాటరీ టికెట్ కొని మోసపోయి.. ఆ స్వర్ణకారుడు భార్యకు, ముగ్గురు పిల్లలకు సైనెడ్ ఇచ్చి, తానూ తీసుకుని చనిపోయారు. 

విల్లుపురంలోని సలామత్ నగర్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో మొత్తం ఐదుగురు చనిపోయారు. బాధితులను పలామలైకి చెందిన ఎం అరుణ్ (33), అతని భార్య శివగామి (26) కుమార్తెలు ధర్షిని(5), మూడు నెలల వయసు కలిగిన యువశ్రీ, భారతి లుగా పోలీసులు గుర్తించారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అరుణ్‌ బాగా అప్పుల్లో కూరుకుపోయాడని, వ్యాపారంలో నష్టాలొచ్చాయని తేలింది. దీంతో ఈ దంపతులు ముందు పిల్లలకు విషం ఇచ్చి, వారు చనిపోయిన తరువాత తాము తీసుకున్నారు. 

 కుమార్తెలను చంపిన కొద్ది నిమిషాల తరువాత, అరుణ్ తన స్నేహితులకు వాట్సప్ లో ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో విల్లుపురంలో స్థానికంగా అందుబాటులో మూడు అంకెల లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేయడం వల్ల తానెంత నష్టపోయిందీ తెలిపారు. ఈ కారణంగా ఈ దారుణంవైపు అడుగులేయాల్సి వచ్చిందని తన స్నేహితులతో తెలిపాడు. 

అంతేకాదు ఈ అక్రమ లాటరీ టికెట్లు విల్లుపురంలో విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తన స్నేహితులకు విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే కనీసం మరో 10 మంది ప్రాణాలు కాపాడబడతాయని ఆయన వీడియోలో పేర్కొన్నారు.

వీడియో క్లిప్ చూసిన అరుణ్ స్నేహితులు వెంటనే అతని ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారు స్పృహ కోల్పోయారు. దీంతో వీరిని విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అయితే అక్కడ వైద్యులు అప్పటికే వారు చనిపోయినట్లు ప్రకటించారు. విల్లుపురం తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios