Asianet News TeluguAsianet News Telugu

ఫాల్స్ కుట్టమంటే.. పట్టుచీరను కాల్చేసింది.. టైలర్ మీద కేసు గెలిచిన మహిళ...

నాలుగైదు రోజుల్లో టైలరింగ్/స్టిచింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని దివ్య హామీ ఇచ్చింది. అయితే, కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసిన దివ్య.. చీర కొన్ని చోట్ల కాలిపోయిందని మంగళకు చెప్పింది. దీంతో ఖంగుతిన్న మంగళ.. తన కొత్త పట్టు చీర బొటిక్ లోనే పాడైందని, కాబట్టి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే దీనిమీద దివ్య ఏమీ మాట్లాడలేదు.

couple sues tailor for spoiling sari, wins case in bengaluru
Author
Hyderabad, First Published Jan 29, 2022, 10:20 AM IST

బెంగుళూరు : పీకో, ఫాల్స్ కుట్టమని sari ఇస్తే ఓ టైలర్ కాల్చేసింది. దీంతో ఓ జంట tailor మీద case పెట్టింది. Consumer Forumని ఆశ్రయించింది. court దంపతులకు ఊరటనిస్తూ ఖరీదైన చీర విలువను కట్టియ్యాల్సిందిగా స్థానిక టైలర్ ను ఆదేశించింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు కోర్టులో పోరాటం కొనసాగిన తర్వాత, bengaluru  వినియోగదారుల ఫోరం ఇటీవల ఈ జంటకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దంపతులకు జరిగిన ఇబ్బందులకు గాను రూ.10,000 పరిహారం, దీంతోపాటు చీర ధర (రూ. 21,975) వాపసు ఇవ్వాలని టైలర్ ని కోర్టు ఆదేశించింది.

వివరాల్లోకి వెడితే... ఆగష్టు 18, 2019న, GKVKలోని జ్యుడిషియల్ లేఅవుట్‌ లో ఉండే 65 ఏళ్ల మంగళా ఇవానికి ఆమె భర్త 75 ఏళ్ల ఇవానీ మైసూర్ సిల్క్ చీరను కొన్నాడు. వారు దాన్ని షోరూమ్ నుండి కొనుగోలు చేశారు. అక్టోబరు 29, 2019న, మంగళ,  ఆమె కుమార్తె తమ ఇంటి పక్కనుండే బొటిక్ కు వెళ్లారు. దీన్ని దివ్య అనే మహిళ నడుపుతుంది. ఆ చీరకు ఫాల్స్ కుట్టడంతో పాటు మరికొన్ని బట్టలు ఆల్ట్రేషన్ చేయడానికి ఇచ్చారు. 

నాలుగైదు రోజుల్లో టైలరింగ్/స్టిచింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని దివ్య హామీ ఇచ్చింది. అయితే, కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసిన దివ్య.. చీర కొన్ని చోట్ల కాలిపోయిందని మంగళకు చెప్పింది. దీంతో ఖంగుతిన్న మంగళ.. తన కొత్త పట్టు చీర బొటిక్ లోనే పాడైందని, కాబట్టి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే దీనిమీద దివ్య ఏమీ మాట్లాడలేదు.

దీంతో దివ్యనుంచి 50 రోజుల వరకు ఎలాంటి స్పందన లేదు. దీంతో విసుగెత్తిన మంగళ దివ్య బొటిక్ సర్వీసులో లోపం ఉందని.. తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు పంపారు. అలాగే ఈ మేరకు ఇద్దరూ శాంతినగర్‌లోని బెంగళూరు రూరల్, అర్బన్ 1వ అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదికను ఆశ్రయించారు. జనవరి 18, 2020న ప్రారంభమైన వ్యాజ్యంలో, కస్టమర్‌లు తమ వాదనలను న్యాయవాది ద్వారా సమర్పించగా, దివ్య తన న్యాయవాది ద్వారా వాదించుకుంది.

కస్టమర్ తనకు పాత చీర ఇచ్చారని, గతంలో ఇస్త్రీ సమయంలో చీర కాలిపోయిందని, ఆ నష్టానికి తననే తప్పుబడుతున్నారని దివ్య ఫిర్యాదు చేసింది. తన బిజీ వర్క్ షెడ్యూల్ కారణంగా చీరను తీసుకునే ముందు దానిని క్షుణ్ణంగా పరిశీలించడంలో విఫలమయ్యానని దివ్య తెలిపింది.

చీర తీసుకునే ముందు.. పరిశీలించి ఉండాల్సింది... 
దాదాపు 24 నెలల పాటు కొనసాగిన విచారణలో, బెంగళూరు వినియోగదారుల న్యాయస్థానం న్యాయమూర్తులు, దివ్య పట్టుచీరను ఫాల్స్ కుట్టుడానికి తీసుకునే ముందు దానిని పరిశీలించాల్సిన బాధ్యత ఆమెకు ఉందని, ఆ పని చేయకుండా, పని ఒత్తిడితో గమనించలేదని ముందుగానే  పాడైందని పేర్కొంటూ బాధ్యతా రహితంగా తప్పించుకోవడానికి ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు అని చెప్పుకొచ్చారు.

జనవరి 13, 2022న దీనిమీద వెలువరించిన తీర్పులో, దర్జీకి సంబంధించిన చీర విలువ (రూ. 21,975), రూ. 5,000 నష్టపరిహారంగా, మరో రూ. 5,000 కస్టమర్ల కోర్టు ఖర్చులకు చెల్లించాలని న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. కోర్టు ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios