Viral video| ఢిల్లీ మెట్రో రైల్‌లో ఓ ప్రేమ జంట బరితెగించింది. ఒకరి మూతీని ఒకరూ నాక్కుంటూ ముద్దులాటలో మునిగిపోయారు. తోటి ప్రయాణికులు చూస్తున్నారన్న కనీస ఇగితం మరిచి ప్రవర్తించారు. వీరి లిప్‌లాక్ సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రో స్టేషన్(Delhi Metro Station) మరోసారి ముఖ్యాంశాల్లోకి ఎక్కింది. ఈ మెట్రో ప్రేమ జంటలకు అడ్డాగా మారింది. లవర్స్ ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, వీలైతే.. కలిసి స్టెప్పులేయడం వంటి వీడియోలు పలు వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్(Viral) అయ్యాయి. ఇలాంటి ఘటనలను అడ్డుకోవడానికి డిఎంఆర్సీ(DMRC) మెట్రో లోపల ఫ్లయింగ్ స్క్వాడ్ లను కూడా ఏర్పాటు చేసింది. అయినా.. కొందరూ పట్టించుకోవడం లేదు. నలుగురిలో ఉన్న సోయిని కూడా మరిచిపోతున్నారు.
తాజాగా ఢిల్లీ మెట్రో(Delhi Metro)లో ఓ ప్రేమికుల జంట రెచ్చిపోయింది. ఒకరిమూతీని మరోకరూ మూతీ నాక్కుంటూ ముద్దులాటలో మునిగిపోయింది. కనీసం తోటి ప్రయాణికులు చూస్తున్నారన్న ఇగితం కూడా మరిచి ప్రవర్తించారు. అందరూ చూస్తుండగానే లిప్‌లాక్‌లో లీనమై బరితెగించారు. ఢిల్లీ మెట్రోలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..
సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ఓ వీడియో షేర్ అవుతోంది. మే 9న @SonOfChoudhary అనే వినియోగదారు ఈ 30 సెకన్ల క్లిప్‌ని ట్విట్టర్‌లో షేర్ చేసి ఇలా వ్రాశారు. ఢిల్లీ మెట్రో పేరును పోర్న్‌హబ్‌గా ఎందుకు మార్చకూడదు? అంటూ సంచలన కామెంట్ చేశారు. ఈ వార్త రాసే వరకు.. ఈ క్లిప్‌కి 5500 కంటే ఎక్కువ లైక్‌లు, 1 లక్ష 75 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఒక యువ జంట ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తూ.. కోచ్ లో కింద కూర్చున్నారు. అమ్మాయి అబ్బాయి ఒడిలో పడుకోవడం.యువకుడు ఆమెను ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు. ఆ జంట ఏ మాత్రం తడబాటు లేకుండా ఇద్దరూ లిప్ లాక్ చేసుకుంటున్నారు. ముందు సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు ఈ వీడియోను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియోపై చాలా మంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ ఘటన వార్తల్లోకి రావడంతో పలువురు డీఎంఆర్‌సీపై విమర్శలు గుప్పించారు. DCP ఢిల్లీ మెట్రోని ట్యాగ్ చేస్తూ, ఒక వినియోగదారు ట్వీట్ చేసారు – మీరు మేల్కొన్నారా? అదే సమయంలో, కొంతమంది వినియోగదారులు అమ్మాయి మత్తులో ఉన్నట్లు అనిపించిందని పేర్కొన్నారు. యువతకు ఏమైంది అని ఓ వ్యక్తి రాయగా.. మరికొందరు ఆ అమ్మాయికి సీపీఆర్ ఇస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. నేటి యువత పూర్తిగా మారిపోయారనీ, ఎక్కడ ఎలాంటి పనులు చేయాలో వారికి తెలియడం లేదని మరికొందరు వినియోగదారులు పేర్కొంటున్నారు. అలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని 'ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్' (DMRC)ని ట్వీట్ చేసి అభ్యర్థించారు.
'ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్' ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చట్టంలోని సెక్షన్-59 ప్రకారం అసభ్యత శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. దీనికి సంబంధించి.. మెట్రోలో ప్రయాణించేటప్పుడు ప్రజలు డెకోరమ్‌ను కొనసాగించాలని DMRC విజ్ఞప్తి చేసింది. ప్రయాణీకులు అసభ్యకరమైన దుస్తులు ధరించరాదని లేదా తోటి ప్రయాణీకుల మనోభావాలను దెబ్బతీసే కార్యకలాపాలు చేయకూడదని DMRC తెలిపింది. ప్రయాణంలో దుస్తుల ఎంపిక వ్యక్తిగత విషయం అయినప్పటికీ, ప్రయాణికులు బాధ్యతాయుతమైన పౌరునిలా ప్రవర్తించాలని భావిస్తున్నారు.
