Asianet News TeluguAsianet News Telugu

పాముతో ప్రీవెడ్డింగ్ షూట్.. ఐడియా అదిరింది..!

ఈ రోజుల్లో ఫ్రీ వెడ్డింగ్ షూట్ లేకుండా జరుగుతున్న పెళ్లిళ్లు చాలా అరుదు అనే చెప్పొచ్చు. ఈ క్రమంలో రకరకాల వింతలు చేసిన వారు కూడా ఉన్నారు. తాజాగా ఓ జంట తమ ప్రీవెడ్డింగ్ షూట్ లో మరింత క్రియేటివిటీ జత చేశారు.

Couple Pre wedding shoot with Snake goes viral ram
Author
First Published Jun 2, 2023, 9:56 AM IST

ఈ రోజుల్లో పెళ్లి అంటే ఫోటోలు కామన్. ఫోటోలు అంటే పెళ్లి మండపంలో తీసే ఫోటోలు మాత్రమే కాదు.. పెళ్లికి ముందే వధూ, వరులు వేరే స్పెషల్ లొకేషన్ కి వెళ్లి మరీ ఫోటోలు దిగుతున్నారు. దానికి బ్యాగ్రౌండ్ లో పాట ప్లే చేసి, సినిమాటిక్ రేంజ్ లో చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఫ్రీ వెడ్డింగ్ షూట్ లేకుండా జరుగుతున్న పెళ్లిళ్లు చాలా అరుదు అనే చెప్పొచ్చు. ఈ క్రమంలో రకరకాల వింతలు చేసిన వారు కూడా ఉన్నారు. తాజాగా ఓ జంట తమ ప్రీవెడ్డింగ్ షూట్ లో మరింత క్రియేటివిటీ జత చేశారు.

 

తమ ప్రీ వెడ్డింగ్ షూట్ లో పామును కూడా కలిపారు.  పాము కారణంగా ఆ జంట ఒక్కటైనట్లుగా వీడియో చిత్రీకరించడం విశేషం. ఈ వీడియోని వివేక్ అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేయగా, అది కాస్తా వైరల్ గా మారింది. వీడియోలో  చూపించిన దాని ప్రకారం ఓ యువతి నడుచుకుంటూ వెళ్తుంటే పాము కనపడుతుంది. ఆమె ఆ పామును చూసి భయపడుతుంది. ఇంతలో స్కూటీ పై ఇద్దరు యువకులు వస్తారు. వారిలో ఒకరు ఆమెను పాము నుంచి కాపాడతారు. పామును పట్టి ఓ బాక్స్ లో పెడతారు.

 

పామును పట్టడం అయిపోయిన తర్వాత ఆ యువకుడు ఆమెకు ఫోన్ చేయమంటూ సిగ్నల్ ఇస్తాడు. ఇలా పాము కారణంగా వారి మధ్య పరిచయం ఏర్పడగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. అనే కాన్సెప్ట్ లో ఈ వీడియో తీయడం విశేషం. చివరలో సింబాలిక్ గా వారిద్దరూ ముందు వెళ్తుంటే, వెనక పాము ఉన్నట్లు చూపిస్తారు. అంటే వారిని పాము ఒక్కటి చేసింది అనేది వారి కాన్సెప్ట్. ప్రస్తుుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా చూసేయండి.

Follow Us:
Download App:
  • android
  • ios