28 ఏళ్ల  తర్వాత  తన భార్యను కలుసుకొన్నాడు ఓ భర్త. ఓ కేసులో శిక్షను అనుభవిస్తున్న  సుబ్రమణియన్‌కు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడంతో వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తన భార్యను  కలుసుకొన్నాడు


చెన్నై: 28 ఏళ్ల తర్వాత తన భార్యను కలుసుకొన్నాడు ఓ భర్త. ఓ కేసులో శిక్షను అనుభవిస్తున్న సుబ్రమణియన్‌కు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడంతో వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తన భార్యను కలుసుకొన్నాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

శ్రీలంకకు చెందిన బక్కర్ అలియాస్ విజయ తమిళుల వైరుధ్యం సమయంలో తమిళనాడుకు చేరుకొంది వీధుల్లో నాట్యం చేస్తూ జీవనం సాగించేది. విజయ నాట్యానికి సుబ్రమణియం ఆకర్షితుడయ్యాడు.ఆమెను ప్రేమించాడు. సుబ్రమణియం ఇంట్లో ఈ ప్రేమను అంగీకరించలేదు.

దీంతో సుబ్రమణియం 1985లో విజయను వివాహం చేసుకొన్నాడు. ఆ తర్వాత కూడ వీరిద్దరూ వీధుల్లో నాట్యం చేస్తూ జీవనం సాగించేవారు. రాత్రి వేళల్లో రోడ్డు పక్కన నిద్రిస్తుండేవారు.

అయితే ఈ సమయంలో ఓ వ్యక్తి విజయపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో సుబ్రమణియన్ ఆగ్రహంతో అతనిపై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ కేసులో సుబ్రమణియన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 1990లో కోవై కోర్టు సుబ్రమణియన్‌కు జీవిత శిక్ష విధించింది. వేలూరు మహిళా జైల్లో విజయను, పురుషుల జైల్లో సుబ్రమణియన్ ను ఉంచారు. జైల్లో విజయకు అనారోగ్యంతో మాట పడిపోయింది.