ఢిల్లీలో ఓ దంపతులు హత్య చేయబడ్డారు. వారితో పాటు ఇంట్లో పని చేసే అమ్మాయి కూడా హత్యకు గురయ్యింది. అయితే వారి రెండేళ్ల పాప మాత్రం క్షేమంగా ఉంది.
న్యూఢిల్లీ : ఢిల్లీలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ దంపతులతో పాటు వారి ఇంటి పనిమనిషి హత్యకు గురయ్యింది. ఆ వీరిని సమీర్ అహుజా, అతని భార్య షాలుగా గుర్తించారు. అయితే వారి రెండేళ్ల పాప మాత్రం క్షేమంగా ఉంది. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. ఢిల్లీలోని కౌపైల్ అశోక్ విహార్ లోని దంపతుల ఇంట్లో హత్యలు జరిగినట్లు అధికారులు తెలిపారు.
వారింట్లో పనిచేస్తున్న మహిళ స్వప్న మంగళవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో దంపతుల ఇంటికి వచ్చింది. ఆ తర్వాత హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఈరోజు ఉదయం ఐదుగురు వ్యక్తులు మోటార్‌బైక్‌పై వారి ఇంటికి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి హత్య కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
