వాలంటైన్స్ డే రోజున విషాదం చోటుచేసుకుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లిన ఓ జంట సముద్రంలో మునిగి మృతిచెందారు. 

వాలంటైన్స్ డే రోజున విషాదం చోటుచేసుకుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లిన ఓ జంట సముద్రంలో మునిగి మృతిచెందారు. ఈ ఘటన గోవాలో చోటుచేసుకుంది. మృతులను విభు శర్మ (27), సుప్రియా దూబే (26)‌‌లుగా గుర్తించారు. వివరాలు.. విభు శర్మ ముంబైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. సుప్రియా దూబే బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. వీరు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వెకేషన్ కోసం గోవాకు వచ్చారు. వీరు అక్కడే హోటల్‌లో స్టే చేశారు. 

సోమవారం రాత్రి వారు భోజనంం చేసిన తర్వాత ఈత కొట్టేందుకు దక్షిణ గోవా జిల్లా కెనకోనా తాలూకాలోని పలోలెం బీచ్‌ సమీపంలోని నీటిలోకి దిగారు. అయితే వారు కొంతసేపటికే నీటిలో ముగినిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లైఫ్‌గార్డుల సహాయంతో గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పలోలెం సమీపంలోని ఊరెం బీచ్‌ వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె భాగస్వామి మృతదేహం మధ్యాహ్నం ఆ ప్రదేశానికి ఆ ప్రాంతానికి కొద్ది దూరంలో కనిపించింది. 

ఈ ఘటనపై కెనకోనా పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ అధికారి మాట్లాడుతూ.. విభు శర్మ, సుప్రియా దూబే‌లు చెక్-ఇన్ చేసిన హోటల్‌లోని సిబ్బంది వాంగ్మూలం రికార్డ్ చేయబడిందని తెలిపారు. ముద్రంలోకి వెళ్లే ముందు వీరిద్దరూ డిన్నర్, డ్రింక్స్ తీసుకున్నారని హోటల్ సిబ్బంది తెలిపారని చెప్పారు. ఈ మరణాల్లో ఎలాంటి అనుమానస్పద అంశాలు లేవని పోలీసులు తెలిపారు. ఇక, సుప్రియ, విభులు బంధువులని.. వారు గోవాలో ఉన్నారనే విషయం వారి వారి కుటుంబసభ్యులకు తెలియదని సమాచారం.