Asianet News TeluguAsianet News Telugu

కిలాడీ జోడి... మాటలతో మాయచేసి.. రూ.40లక్షలు కాజేశారు..!

కొద్ది నెలల్లోనే ఆ డబ్బును శుభమ్ తిరిగి ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే తన భార్య రంజనా కౌర్‌ను కూడా పరిచయం చేశాడు. ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు కూడా జరిగాయి. మంచి స్నేహితులుగా కూడా మారారు. 

couple Cheated Family and looted money in Pune
Author
Hyderabad, First Published Jun 16, 2021, 1:15 PM IST

ఈ భార్యాభర్తలు మామూలోళ్లు కాదు. మాటలతోనే ఎవరినైనా మాయ చేసేస్తారు. మంచిగా నటించి.. మాయ చేసి ఏకంగా రూ.40లక్షలు కాజేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పరమేశ్వర్ కుంచేకర్ అనే 33ఏళ్ల వ్యక్తి పూణేలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేసుకుంటూ వ్యాపారం కూడా నడుపుతుంటాడు. రెండేళ్ల క్రితం కుంచేకర్ స్నేహితుడు ఒకరు శుభం గౌర్ అనే వ్యక్తిని  పరిచయం  చేశాడు.

ఢిల్లీలో ఇన్‌కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని చెప్పాడు. కొంత డబ్బు అవసరం ఉందనీ, త్వరలోనే ఇస్తానంటూ అడిగాడు. సరేనన్న కుంచేకర్ ఓ ఐదు లక్షల రూపాయలను అప్పుగా ఇచ్చాడు. కొద్ది నెలల్లోనే ఆ డబ్బును శుభమ్ తిరిగి ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే తన భార్య రంజనా కౌర్‌ను కూడా పరిచయం చేశాడు. ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు కూడా జరిగాయి. మంచి స్నేహితులుగా కూడా మారారు. 

ఈ క్రమంలోనే కుంచేకర్‌కు ఓ లిక్కర్ షాపునకు అనుమతులు ఇప్పిస్తానని శుభమ్ చెప్పాడు. ఇది నిజమేనని నమ్మిన కుంచేకర్ దానికి సంబంధించిన వ్యవహారాల నిమిత్తం అడిగినంత డబ్బులను ఇస్తూ పోయాడు. అనుమతుల కోసమనీ, అధికారులను మేనేజ్ చేయడానికంటూ పలుదఫాలుగా పలు కారణాలు చెప్పి ఏకంగా 40 లక్షల రూపాయలను కాజేశారు. 

రంజన కూడా ఇది నిజమేనని నమ్మించేలా కుంచేకర్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడేది.  ఇటీవల లాక్‌డౌన్ వల్ల కుంచేకర్ తన స్వగ్రామానికి వెళ్లాడు. కొద్ది రోజుల క్రితం పుణె నగరానికి వచ్చిన కుంచేకర్ లిక్కర్ షాపు అనుమతుల గురించి మాట్లాడదామని శుభమ్ గౌర్ ఫ్లాట్‌కు వెళ్లాడు. అయితే అప్పటికే వాళ్లు ఫ్లాట్‌ను ఖాళీ చేశారనీ, వారి గురించిన ఇతర వివరాలు తనకు తెలియదని ఫ్లాట్ యజమానులు చెప్పారు. ఫోన్లు చేసినా ఫలితం లేకపోవడంతో కుంచేకర్ పోలీసులను ఆశ్రయించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios