Asianet News TeluguAsianet News Telugu

ఉడుత మాంసం తిన్న దంపతులు... ఊరు వదిలిపోతున్న గ్రామస్థులు

ఆరోగ్యం బాగుపడాలంటే... ఉడుత పచ్చిమాంసం తిన్నారు ఓ ఇద్దరు దంపతులు. ఆరోగ్యం మెరుగుకాకపోగా... మరింత తీవ్ర అనారోగ్యానికి గురై... కన్నుమూశారు. 

Couple Ate Squirrel Believed To Have Health Benefits. They Died Of Plague
Author
Hyderabad, First Published May 9, 2019, 2:31 PM IST

ఆరోగ్యం బాగుపడాలంటే... ఉడుత పచ్చిమాంసం తిన్నారు ఓ ఇద్దరు దంపతులు. ఆరోగ్యం మెరుగుకాకపోగా... మరింత తీవ్ర అనారోగ్యానికి గురై... కన్నుమూశారు. వారి మరణంతో... ఆ గ్రామంలోని ప్రజలంతా ఊరు వదిలి పారిపోతున్నారు. ఈ ఘటన మంగోలియా- రష్యా సరిహద్దులోని సగనూర్‌ పట్టణంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మంగోలియా సరిహద్దు వద్ద భద్రతా ఏజెంట్‌గా పనిచేసే ఓ వ్యక్తికి అనారోగ్యం సోకడంతో ఉడుత మాంసం తినాలని భావించాడు. ఈ క్రమంలో భార్యతో కలిసి ఉడుత కిడ్నీలు, గాల్‌ బ్లాడర్‌, ఉదర భాగాన్ని పచ్చిగానే ఆరంగించాడు. దీంతో ఇన్‌ఫెక్షన్‌ సోకి జ్వరం, తీవ్రమైన తలనొప్పితో పాటు శరీరంలోని వివిధ అవయవాలు పాడైపోవడంతో రావడంతో సదరు వ్యక్తి పదిహేను రోజుల క్రితం మరణించగా.. ఈనెల 1న అతడి భార్య ఆస్పత్రిలో మృతిచెందింది. దీంతో సగనూర్‌ పట్టణ ప్రాంతం‍లో అలర్ట్‌ విధించడంతో స్థానికులంతా అక్కడి నుంచి దూర ప్రాంతాలకు పయనమవుతున్నారు.

ఈ విషయం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వాలంటీర్‌ ఆరిన్‌తుయా ఓచిర్‌పురేవ్‌ మాట్లాడుతూ.. పచ్చి మాంసం తినడం వల్లే దంపతులిద్దరు చనిపోయారని పేర్కొన్నారు. వీరికి తొమ్మిది నుంచి 14 నెలల వయస్సు గల నలుగురు పిల్లలు ఉన్నారని.. ప్రస్తుతం వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. 

మృతులకు సోకిన అత్యంత ప్రమాదకర నిమోనిక్ ప్లేగు వ్యాధి వేగంగా వ్యాప్తి చెందే కారణంగా ప్రభుత్వాధికారులు ప్రజలను వెంటనే అప్రమత్తం చేశారని వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. ఏ జంతువు పచ్చి మాంసమైనా ప్రమాదమేనని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios