Asianet News TeluguAsianet News Telugu

మూడో దశకు చేరుకున్న మోడెర్నా టీకా.. ఏడాది చివరకు వ్యాక్సిన్?

మోడెర్నా వ్యాక్సిన్ ఈ సంవత్సరం చివరినాటికి సిద్ధం కానున్న‌ద‌ని అమెరికా తెలిపింది. మోడెర్నా సంస్థ ఈ టీకా కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ అమెరికాతో కలిసి పనిచేస్తోంది. 

Coronavirus Vaccine: Moderna begins phase-3 clinical trial of Covid vaccine in US
Author
Hyderabad, First Published Jul 28, 2020, 12:38 PM IST

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ ఇప్పటికే కొన్ని లక్షల మందికి సోకగా.. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.  ఈ నేపథ్యంలో ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనుగొనేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి. వివిధ సంస్థ‌ల నుంచి సుమారు 150 టీకాలు రానున్నాయి. వాటిలో 140 వ్యాక్సిన్లు ప్రారంభ దశలోనే ఉన్నాయి. అయితే కొన్ని వ్యాక్సిన్‌లు మూడవ దశ ట్ర‌య‌ల్స్‌కు చేరుకున్నాయి. మోడెర్నా, ఫైజర్, ఆస్ట్రాజెనెకా, భారత్ బయోటెక్ వ్యాక్సిన్లు ఇందులో ముందంజలో ఉన్నాయి.

కాగా.. మోడెర్నా టీకా ఇప్పటికే విజయవంతగా మూడో దశకు చేరుకుంది. అతిపెద్ద ట్రయల్ ప్రారంభమైంది. ఈ ద‌శ‌లో 30 వేల మందికి టీకాలు వేయనున్నారు. ఇదే దీని చివ‌రి ట్ర‌య‌ల్ కానుంది. మోడెర్నా వ్యాక్సిన్ ఈ సంవత్సరం చివరినాటికి సిద్ధం కానున్న‌ద‌ని అమెరికా తెలిపింది. మోడెర్నా సంస్థ ఈ టీకా కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ అమెరికాతో కలిసి పనిచేస్తోంది. ఈ టీకా ధ‌ర గురించి ఇంత‌వ‌ర‌కూ వెల్ల‌డికాలేదు. ఈ టీకాను అభివృద్ధి చేసేందుకు అమెరికా ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అంత సవ్యంగా జరిగితే... ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios