కరోనా వైరస్: వ్యాక్సిన్ తయారీ టీమ్‌కు మనోడే లీడర్
కరోనా వైరస్ కు విరుగుడుగా వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీలో ఇండియన్ డాక్టర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
న్యూఢిల్లీ:ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను నివారించేందుకు వ్యాక్సిన్ తయారీ బృందంలో భారత సంతతికి చెందిన సైంటిస్ట్
డాక్టర్ ఎస్ఎస్ వాసన్ ఈ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.
చైనాలో ఇప్పటికే 30 వేల మందికి ఈ వ్యాధి సోకింది. మరో 600 మంది ఈ వ్యాధితో మృతి చెందారు. కరోనా వ్యాధి నివారణ కోసం వ్యాక్సిన్ తయారు చేసేందుకు డాక్టర్ల బృందం ప్రయత్నాలను చేస్తోంది.
కామన్ వెల్త్ సైంటిఫిక్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(సీఎస్ఐఆర్ఓ)లో ఈ బృందం వ్యాక్సిన్ తయారు చేయనుంది. అస్ట్రేలియాకు చెందిన లీడింగ్ సైంటిఫిక్ ఏజెన్సీ.
వాసన్ టీమ్ మెల్‌బోర్న్‌లోని డోర్నీ ఇనిస్టిట్యూట్ లో కరోనా వైరస్‌ను డెవలప్ చేశారు. ఈ వైరస్ ను మనిషి షాంపిల్స్ నుండి విజయవంతంగా వేరు చేశారు.కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారీ కోసం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రయల్స్ కీలక దశకు చేరుకొన్నట్టుగా సీఐఎస్ఆర్ఓ ప్రకటించింది.
Also read:వూహాన్‌లోని జ్యోతికి మంత్రి ఫోన్: అఖిలప్రియ వద్ద స్పృహ తప్పిన తల్లి
ఈ వైరస్‌ను అభివృద్ది చేసేందుకు ఈ బృందం రకరకాల ప్రయోగాలను చేస్తోంది. ఈ ప్రయోగాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నట్టుగా టీమ్ తెలిపింది. బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పూర్వ విద్యార్థి.
వాసన్ గతంలో డెంగ్యూ, జికా, చికెన్ గున్యాలపై ఆయన పనిచేశారు. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం కనీసం 16 వారాల పాటు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని టీమ్ ప్రకటించింది. ప్రపంచంలోని పలు దేశాల్లో 240 కేసులు నమోదయ్యాయి.