తాజ్ మహల్ పర్యాటకులకు క‌రోనా ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి..: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం

Agra: కోవిడ్-19 ఆందోళనల మధ్య, క‌రోనా వైర‌స్ పరీక్షలు లేకుండా తాజ్ మహల్ లోకి పర్యాటకులకు ప్రవేశం లేదని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పేర్కొంది. ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించడానికి దేశీయ, విదేశాల నుంచి పర్యాటకులు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వ‌స్తుంటారు. 
 

Coronavirus tests mandatory for Taj Mahal tourists: Uttar Pradesh govt

Taj Mahal-Corona Virus: జ‌పాన్, చైనా, అమెరికా, స‌హా ప‌లు ఆసియా దేశాల్లో క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి ఇటీవ‌ల గుర్తించిన కొత్త వేరియంట్లే కార‌ణ‌మ‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నాయి. తాజాగా సంబంధిత వేరియంట్లు భార‌త్ లోనూ వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన క‌రోనా ప‌రిస్థితుల‌పై సమావేశమైన ఒక రోజు తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం గురువారం నాడు కోవిడ్-19పై సమీక్షా సమావేశం నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు సైతం క‌రోనా కేసులు పెరుగుతున్న క్ర‌మంలో అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నాయి.  

తాజ్ మ‌హ‌ల్ ప‌ర్యాట‌కుల‌కు కోవిడ్ ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి.. 

క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్ర‌దేశాల్లో ఒకటైన ఆగ్రాలోని తాజ్ మహల్ ను అప్రమత్తం చేసినట్లు ఆగ్రాలోని జిల్లా ఆరోగ్య సమాచార అధికారి ధృవీకరించారు. ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించడానికి దేశీయ, విదేశాల నుంచి ఇక్క‌డ‌కు పర్యాటకులు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా తాజ్ మ‌హ‌ల్ ను చూడ‌టానికి వ‌చ్చే వారు వారి సందర్శనకు ముందు కోవిడ్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని స్ప‌ష్టం చేశారు. క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్న వారికి మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు. జిల్లా ఆరోగ్య సమాచార అధికారి (ఆగ్రా) అనిల్ సత్సంగి మాట్లాడుతూ, క‌రోనా వైర‌స్ సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి ఆరోగ్య శాఖ ఇప్పటికే పరీక్షలను ప్రారంభించింది. అప్రమత్తత కొనసాగుతున్నందున, సందర్శకులందరికీ ఇప్పుడు పరీక్షలు తప్పనిసరి చేశారని తెలిపారు. 

కోవిడ్ మార్గదర్శకాలను జారీచేసిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్..

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నివారణ చర్యలు తీసుకుంటూ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా హెచ్చరిక జారీ చేసింది. అలాగే, కేసులు పెరిగితే సంసిద్ధతను పెంచింది. రాష్ట్రంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్లు, మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ ఆదేశించారు. "మాస్క్ ధరించడం ద్వారా మాత్రమే బయటకు వెళ్లండి- జాగ్రత్త వహించండి. ఆదేశాలను త‌ప్ప‌కుండా పాటించండి' అని పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కరోనా వైరస్ కు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం విశ్లేషించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. అలాగే, విదేశాల నుంచి వచ్చేవారిపై నిఘా పెంచుతూ.. విమానాశ్రయంలో చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇన్ఫెక్షన్ ప్రభావిత దేశాల నుంచి తిరిగి వచ్చిన వారిని తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాల‌ని పేర్కొంది. ఇన్ఫెక్షన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తనిఖీ చేయాలని ఉప ముఖ్యమంత్రి అన్నారు. వారి శాంపిళ్ల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయండని వైద్య వ‌ర్గాల‌కు తెలిపారు. కొత్త కోవిడ్ వేరియంట్లను ఖచ్చితంగా గుర్తించడంలో ఇది సహాయపడుతుంద‌న్నారు. 

ముఖ్యంగా జలుబు, జ్వరంతో సహా ఇతర లక్షణాలు ఉన్న ప్రయాణీకులను గుర్తించాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. కోవిడ్ అనుమానితుల నమూనాలను సేకరించి తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమయంలో, ప్రయాణాల నుండి తిరిగి వచ్చిన వ్యక్తులు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సలహా ఇవ్వాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి జాబితాను తయారు చేయాలని ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios