కౌలాలంపూర్: మలేషియాలోని కౌలాలంపూర్ లోని విమానాశ్రయంలో 200 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకపోయారు. విమానాలను రద్దు చేయడంతో వారు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, నీరు ఏదీ అందుబాటులో లేదని వారంటున్నారు. వారంతా పిలిప్పైన్స్ లో వారంతా ఎంబీబీఎస్ చదువుతున్నారు. 72 గంటల లోపు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో తాము భారత్ కు ప్రయాణమయ్యారు.

అయితే, మలేషియాలోని కౌలాలంపూర్ కు చేరుకున్న తర్వాత అకస్మాత్తుగా విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వారు ఇండియాకు తిరిగి రాలేకపోతున్నారు. వారంతా మంగళవారం ఉదయం 6 గంటలకు పిలిప్పైన్స్ నుంచి బయలుదేరారు. ఉదయంపూట కొన్ని విమానాలు నడిచాయని వారు చెబుతున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా విమానాలు రద్దు చేశారని, అలా చేసి మీరు రావద్దంటే తామేం చేయాలని వారంటున్నారు. 

మార్చి 31వ తేదీ వరకు అనుమతించబోమని చెబుతున్నారని, అంత వరకు తాము ఎక్కడ ఉండాలని వారంటున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లద్దని కూడా చెబుతున్నారని వారంటున్నారు. ఒక్క రోజు అనుమతిస్తే తమ స్వదేశానికి రాగలమని అంటున్నారు. కౌలాలంపూర్ కూడా తమ సేఫ్ కాదని వారంటున్నారు. 

ఏప్రిల్ 14వ తేదీ వరకు తాము పిలిప్పైన్స్ వెళ్లలేమని, తమ వీసాల గడువు కూడా ముగుస్తోందని, మార్గమధ్యలో చిక్కుకుపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పరీక్షలు నిర్వహించి, అవసరమైతే క్వారంటైన్ చేయవచ్చునని, కానీ రాకూడదంటే తాము ఎక్కడికి వెళ్లాలని అంటున్నారు. తమకు పరీక్షలు నిర్వహించి నెగెటివ్ వస్తే స్వదేశానికి అనుమతించాలని వారంటున్నారు.