న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో  దేశంలో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి.  నెల రోజుల్లో సగానికి సగం  అమ్మకాలు పడిపోయాయి.  చికెన్ తింటే  కరోనా వైరస్ వస్తోందనే ప్రచారం నేపథ్యంలో అమ్మకాలు పడిపోయినట్టుగా  చెబుతున్నారు. 

వారానికి 6 లక్షల కోళ్లు విక్రయించేవారమని, నెల రోజుల్లో 40 శాతం అమ్మకాలు తగ్గాయని కోళ్ల వ్యాపారులు చెప్పారు.  నెల రోజుల్లో 40 శాతం అమ్మకాలు తగ్గినట్టుగా వ్యాపారులు చెబుతున్నారు. కరోనా వైరస్ చికిన్ వల్ల కూడ ప్రబలే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం కూడ అమ్మకాలపై ప్రభావం చూపిందన్నారు.

కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత చికెన్  విక్రయాలు పుంజుకొనే అవకాశం ఉందంటున్నారు  మార్కెట్ నిపుణులు. అయితే విక్రయాలు పుంజుకొన్న తర్వాత చికెన్  కొరత ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు వ్యాపారులు.

దేశంలో ప్రతి వారం సుమారు 7. 5 కోట్ల కోళ్లు విక్రయిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇది 3.5 కోట్లకు పడిపోయింది. హైద్రాబాద్ లో  కొన్ని రోజుల క్రితం చికెన్ కిలో కు రూ. 200లకు పైగా విక్రయించేవారు. గత వారం చికెన్ ధర రూ.110కు తగ్గింది.ప్రస్తుతం కిలో చికెన్ రూ.జ 130లకు విక్రయిస్తున్నారు.

alao read:మార్కెట్లకు సోకిన కరోనా: 5 నిమిషాల్లో.. 5 లక్షల కోట్లు హాంఫట్, ఇలాగే కొనసాగితే

  ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రెండు వారాలతో పోలిస్తే చికెన్ అమ్మకాలు సాధారణ స్థితికి వచ్చినట్టుగా చికెన్ వ్యాపారులు చెబుతున్నారు. అదే విధంగా కోడిగుడ్ల ధరలు కూడ తగ్గాయి.చికెన్ తింటే కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఉందనే ప్రచారంలో వాస్తవం లేదని  వ్యాపారులు అంటున్నారు. 

కరోనా వదంతుల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పౌల్ట్రీ పరిశ్రమ రూ.700 కోట్ల వరకు నష్టపోయిందని స్నేహ ఫామ్స్ ఎండీ రామ్‌ రెడ్డి చెప్పారు. కోడి ఉత్పత్తి వ్యం  కిలోకు రూ. 80లు అవుతోందన్నారు. విక్రయ ధర సగానికి పడిపోవడంతో పౌల్ట్రీ సంస్థలు నష్టాలను మూటగట్టుకున్నాయని చెప్పారు.