యాక్టివ్ కేసులను దాటిన రోగుల రికవరీ: కరోనా కేసుల్లో ఐదో స్థానానికి చేరిన ఇండియా
గత 24 గంటల్లో 9,985 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య2,76,583కి చేరుకొన్నాయి.
న్యూఢిల్లీ: గత 24 గంటల్లో 9,985 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య2,76,583కి చేరుకొన్నాయి.
దేశంలోని యాక్టివ్ కేసుల కంటే కోలుకొంటున్నవారి సంఖ్య తొలిసారిగా పెరిగినట్టుగా గణాంకాలు తెలుపుతున్నాయి.ఈ మేరకు బుధవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి 1,35,206 మంది రోగులు కోలుకొన్నారు. ఇంకా 1.33 లక్షల మంది కరోనాతో బాధపడుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు దేశంలో 7,745 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనాతో 279 మంది మరణించారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోటీపడి ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
also read:కరోనాతో వ్యక్తి మృతి: డీజీపీ కార్యాలయం 48 గంటలు మూసివేత
దేశంలోని కరోనా కేసుల కారణంగా ప్రపంచంలో ఇండియా ఐదో స్థానానికి చేరుకొంది. అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే తర్వాత ఇండియా నిలిచింది.గత 20 రోజుల నుండి దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ లేదని అధికారులు తేల్చి చెప్పారు.
దేశంలోని మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు 90 వేలకు చేరుకొన్నాయి. చైనాలో కేవలం 84 వేల కేసులు మాత్రమే ఉన్నాయి.ఇక ముంబైలో కరోనా కేసులు 51వేలు దాటాయి. వుహాన్ లో 700 కేసులు మాత్రమే నమోదయ్యాయి.