కరోనా వైరస్ కి మందు.. మా దగ్గర ఉందంటున్న తమిళనాడు డాక్టర్
రోజు రోజుకి కరోనా వైరస్ కాటేసిన వారి సంఖ్య పెరిగిపోతోంది. శరవేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దగ్గు, జలుబుతో మొదలయ్యే లక్షణాలు సార్స్, న్యుమోనియా వంటి వ్యాధుల్లోకి దింపుతోంది. దీంతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఆ పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. జలుబు చేస్తే చాలు కరోనా వైరస్ అని భయపడే పరిస్థితి వచ్చింది. నిన్న, మొన్నటి వరకు భయపెట్టిన స్వైన్ ఫ్లూ కాస్త తగ్గుముఖం పట్టగానే కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది.
గత కొంతకాలంగా చైనాను భయపెడుతున్న ఈ వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. రోజు రోజుకి కరోనా వైరస్ కాటేసిన వారి సంఖ్య పెరిగిపోతోంది. శరవేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దగ్గు, జలుబుతో మొదలయ్యే లక్షణాలు సార్స్, న్యుమోనియా వంటి వ్యాధుల్లోకి దింపుతోంది. దీంతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ సోకి 80 మంది ప్రాణాలు కోల్పోగా.. 2వేల కరోనా కేసులు నమోదైనట్టు చైనా సర్కార్ ప్రకటించింది.
దీనికి మందు ఏమీ లేదు అంటూ... పలు దేశాలు చేతులెత్తేస్తున్నాయి. సాధారణ జలుబు, జ్వరానికి ఎలాంటి మందు వాడతారో అదే వాడాలి అంటున్నారు. అయితే... ఈ వైరస్ కి తమ వద్ద మందు ఉందని ఓ డాక్టర్ చెప్పడం విశేషం. తమిళనాడు రాష్ట్రంలోని రత్న సిద్ధా హాస్పిటల్ కి చెందిన ఓ వైద్యుడు... ఈ కరోనా వైరస్ కి మందు తాను కనిపెట్టానని చెబుతున్నాడు.
Also Read కేరళ నర్స్ కి కరోనా వైరస్.... సౌదీకి కూడా పాకేసింది.....
ఆయుర్వేద వైద్యంలో 25సంవత్సరాలుగా అనుభవం ఉన్న ఆస్పత్రిగా సిద్ధా హాస్పిటల్ కి పేరు ఉంది. ఈ హాస్పిటల్ లో ముఖ్య డాక్టర్ తనికసలాం ఈ విషయం గురించి ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడారు.
హెర్బల్స్ నుంచి తాము ఓ మందు తయారు చేశామని చెప్పాడు. ఈ మందు అన్ని రకాల జ్వరాలకు పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము ఈ మందు గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), చైనా ప్రభుత్వానికి తెలియజేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ మందును వాడితే 24 గంటల నుంచి 40గంటల్లో పూర్తిగా కోలుకుంటారని చెబుతున్నారు. తాను తమ బృందంతో కలిసి ఈ మందును తయారు చేశానని ఆయన చెప్పారు.
తాము గతంలో డెంగ్యూ తో బాధపడుతున్న చాలా మందికి ఈ మందుతో పూర్తిగా నయం చేశామని చెప్పారు. ప్లేట్ లెట్స్ కౌంట్ పూర్తిగా పడిపోయి.. శరీరంలోని చాలా అవయవాలు పూర్తిగా పాడైన దశలో కూడా కేవలం 24గంటల నుంచి 40 గంటల్లో వారిని కోలుకునేలా చేశామని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మందు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అవసరమైతే చైనా ప్రభుత్వానికి కూడా అందిస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సి. విజయభాస్కర్ మాట్లాడుతూ... ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అసలు ఇప్పటి వరకు తమిళనాడు రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా ఒక్క కరోనా వైరస్ కేసు నమోదు కాలేదని చెప్పడం గమనార్హం.