ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్ లో కనీసం బార్బర్ షాపులు కూడా తెరవలేదు. అయితే.. ఓ వ్యక్తి లాక్ డౌన్ లో హెయిర్ కట్ చేయాలంటూ బలవంతం చేశాడు. సదరు బార్బర్ అంగీకరించలేదని.. తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ సంఘటన బిహార్‌లోని మైన్వా గ్రామంలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకెళితే.. దినేష్ ఠాకూర్ కంటింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్  విధించిన విషయం తెలిసిందే. దీంతో దినేష్ కూడా తన హెయిర్ కటింగ్ సెలూన్‌ను మూసివేశాడు. 

అయితే తమకు కటింగ్ చేయాలంటూ గ్రామస్తులు అతనిపై ఒత్తిడి చేశారు. అందుకు ఠాకూర్ నిరాకరించాడు. ఈ క్రమంలో బిపిన్ దానే అనే వ్యక్తి ఇంటికి రావాలంటూ దినేష్ ఠాకూర్‌కు కబురు పంపాడు. 

అలా వెళ్లిన దినేష్.. మరుసటి రోజు బుల్లెట్ గాయాలతో విగతజీవిగా పడిఉన్నాడు. దీనిపై దినేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.